ఈ చిట్కాతో 'పొడి చర్మాని' కి గుడ్‌బై చెప్పండి 

Updated By ManamTue, 10/30/2018 - 17:00
dry skin
lemon rose

చలి కాలం మొదలయ్యింది అంటే చాలు ఎంత జిడ్డు చర్మం అయినా పొడిబారి పోతుంటుంది. ఎన్ని మాయిశ్చరైజర్లు, లోషన్లు వాడిన మంచి ఫలితం కనిపించదు. అయితే ఇందుకు ఓ ఇంటి చిట్కా చాలా ఉపయోగ పడుతుంది. అదేంటంటే గ్లిజరిన్‌. గ్లిజరిన్‌తో పొడి బారిన చర్మానికి గుడ్‌బై చెప్పొచ్చు. గ్లిజరిన్ లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది శరీరానికి పట్టించగానే చర్మానికి మృదుత్వాన్ని, కోమలత్వాన్ని అందిస్తుంది. 

rose water

గ్లిజరిన్ ,రోజ్ వాటర్, నిమ్మకాయ 
గ్లిజరిన్, రోజ్ వాటర్, నిమ్మకాయతో పొడి బారిన చర్మానికి మంచి పోషణ లభించి అందంగా కనిపిస్తారు. 20 మిల్లీలీటర్ల రోజ్ వాటర్‌ని, 5 చుక్కల గ్లిజరిన్, ఒక నిమ్మకాయ రసాన్ని కలిపి పట్టించడం వలన చర్మానికి మంచి పోషణ లభిస్తుంది . 
 

English Title
say bye to dry skin using this tip
Related News