Home » హార్ధిక్‌ పాండ్యాకు బదులుగా T20 కి తెలుగు ఆటగాడు..!

హార్ధిక్‌ పాండ్యాకు బదులుగా T20 కి తెలుగు ఆటగాడు..!

by Sravya
Ad

ఐపీఎల్ సీజన్ జోరుగా నడుస్తోంది. కొంతమంది క్రికెట్ అభిమానులు ఫోకస్ రాబోయే టీ20 వరల్డ్ కప్ మీద పెట్టారు. పైగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ అవ్వకపోవడంతో అతను కూడా టీ20 వరల్డ్ కప్ 2024 పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుండే ప్లాన్లు కూడా వేస్తున్నారు. టీం ని సిద్ధం చేయడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చింది.

Advertisement

చెత్త ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా కి బదులుగా టీమిండియాలోకి ఒక తెలుగు వాడిని తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇక ప్లేయర్ ఎవరు అనే విషయానికి వచ్చేస్తే.. ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపేస్తోంది ఓపెనర్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మతో పాటుగా క్లాసెస్, అబ్దుల్ సమద్ పేర్లు ఇప్పుడు బాగా వినపడుతున్నాయి వీళ్ళతో పాటుగా మరో క్రికెటర్ కూడా అదరగొట్టేస్తున్నాడు. అతను ఎవరో కాదు నితీష్ కుమార్ రెడ్డి. ఒక మంచి క్వాలిటీ ఆల్ రౌండర్ గా ఎదుగుతున్న నితీష్ కుమార్ రెడ్డి పై టీమ్ ఇండియా సెలెక్టరు కన్ను వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Also read:

Also read:

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్గా నితీష్ కుమార్ రెడ్డిని టీం లోకి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఫామ్ లో లేడు బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. పైగా ఎప్పుడూ గాయపడతాడో కూడా తెలియదు. ఇటువంటి స్థితిలో పాండ్యా పై నమ్మకం పెట్టుకుని T20 వరల్డ్ కప్ 2024 కి ఎంపిక చేసి తల పట్టుకోవడం కంటే శివం దుబే తో పాటుగా నితీష్ కుమార్ రెడ్డి ని టీంలోకి తీసుకుంటే ఉపయోగం ఉంటుందని సెలెక్టర్లు రోహిత్ శర్మ బలంగా నమ్ముతున్నారని సమాచారం మరి ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది చూడాల్సి ఉంది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading