Home » ఛార్మి మాత్ర‌మే కాదు.. నిర్మాత‌లుగా మారి కోట్ల‌లో న‌ష్ట‌పోయిన 10 మంది హీరోయిన్లు వీళ్ళే..!

ఛార్మి మాత్ర‌మే కాదు.. నిర్మాత‌లుగా మారి కోట్ల‌లో న‌ష్ట‌పోయిన 10 మంది హీరోయిన్లు వీళ్ళే..!

by Anji
Ad

సినిమా రంగం అంటేనే అది ఒక బిజినెస్ అనే చెప్పాలి. బిజినెస్‌లో లాభాలు, న‌ష్టాలు స‌ర్వ‌సాధార‌ణం. ఏ బిజినెస్‌లోనైనా లాభాలు న‌ష్టాలు ఊహించ‌వ‌చ్చు కానీ సినీ ఇండ‌స్ట్రీలో మాత్రం ఊహించ‌డం చాలా క‌ష్టమ‌నే చెప్పాలి. ఎందుకంటే ప్రేక్ష‌కులు ఇచ్చే తీర్పును బ‌ట్టి ఆ సినిమా ఫ‌లితం ఆధార‌ప‌డుతుంది. కొన్ని సార్లు బాగుండ‌ద‌నుకున్న సినిమా హిట్ కావ‌చ్చు. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో హిట్ అవుతుంద‌నుకున్న సినిమా స‌క్సెస్ సాధించ‌క‌పోవ‌చ్చు. ఇలా అంచ‌నాలను ఊహించ‌లేమ‌ని చెప్ప‌వ‌చ్చు. సినిమాల్లో సంపాదించిన వాళ్లు తిరిగి సినిమాల్లోనే పెట్టి కోట్లు న‌ష్ట‌పోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇక ఈ లిస్ట్‌లో కొంద‌రూ హీరోయిన్లు కూడా ఉండడం విశేషం. ఆ హీరోయిన్లు ఎవ‌రో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


సావిత్రి :

Advertisement

ఈమె తెలుగు, త‌మిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింద‌నే చెప్పాలి. అయితే సావిత్రి చిన్నారి పాప‌లు అనే సినిమాను నిర్మించి భారీగానే న‌ష్ట‌పోయారు. ఆరోజుల్లో ఈ టాప్ హీరోయిన్ ల‌క్ష‌ల్లోనే న‌ష్ట‌పోయింది. అయితే వాటిని ఇప్పటితో పోల్చుకుంటే దాదాపు రూ.100 కోట్లు న‌ష్ట‌పోయింద‌ని ప‌లువురుపేర్కొంటున్నారు.

జ‌య‌సుధ :

 

జ‌య‌సుధ చాలా సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. సీనియ‌ర్ హీరోలు అయిన‌టువంటి ఎన్టీఆర్‌, ఏఎన్నార్ తో క‌లిసి చాలా సినిమాల్లో క‌నిపించింది. ఇక ఈమె కాంఛ‌న సీత, క‌లికాలం, అదృష్టం వింత కోడ‌ళ్లు వంటి చిత్రాల‌ను నిర్మించి ఈమె భారీగానే న‌ష్ట‌పోయింది.

భూమిక :

తెలుగు సినిమాల్లో రంగ ప్ర‌వేశం చేసిన ముంబ‌యి హీరోయిన్ల‌లో భూమిక చావ్లా ఒక‌రు. ఈమె యువ‌కుడు అనే సినిమాతో ప‌రిచ‌య‌మైంది. ఆ త‌రువాత త‌మిళం, హిందీ చిత్రాల్లో కూడా న‌టించి గొప్ప పేరు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో 2003లో మిస్స‌మ్మ చిత్రానికి ఉత్త‌మ న‌టి అవార్డు ల‌భించింది. ఇక ఈమె త‌కిట త‌కిట అనే చిత్రాన్ని రూ.2కోట్ల బ‌డ్జెట్‌లో నిర్మించి కోటికి పైగానే న‌ష్ట‌పోయింద‌ట భూమిక‌.

క‌ళ్యాణి :

తెలుగులో 2003లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విక్ర‌మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌టువంటి వ‌సంతం చిత్రం ద్వారా విక్ట‌రీ వెంక‌టేష్‌కి స్నేహితురాలి పాత్ర‌లో న‌టించిన క‌ళ్యాణి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముఖ్యంగా వ‌సంతం, శేషు, దొంగోడు, ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. మున్నా, పందెం వంటి చిత్రాలు ఈమెకి మంచి గుర్తింపునే తెచ్చిపెట్టాయి. సినిమాల్లో న‌టించిన క‌ళ్యాణి ‘K2K Productions’ అనే ఓ బ్యాన‌ర్ స్థాపించి ద్విభాషా చిత్రాన్ని రూపొందించింది. ఆ సినిమా వ‌ల్ల చాలానే క‌ష్ట‌పోయింది కళ్యాణి.

ఇవి కూడా చ‌ద‌వండి :  V V Vinayak : చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా విష‌యంలో ఆ త‌ప్పు చేయ‌క‌పోయి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది..!

విజ‌య‌శాంతి :

Advertisement

సినీ న‌టి విజ‌య‌శాంతి గురించి తెలియ‌ని వారుండ‌రు. ఆమె దాదాపు 30 సంవ‌త్స‌రాల పాటు సినీ ఇండ‌స్ట్రీలో వివిధ భాష‌ల్లో దాదాపు 180 సినిమాల‌లో న‌టించింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం, హిందీ చిత్రాల్లో న‌టించి అప్ప‌ట్లో మంచి గుర్తింపునే సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె లేడీ సూప‌ర్ స్టార్ అనే బిరుదు కూడా సంపాదించుకుంది. ఈమె హీరోయిన్‌గా న‌టిస్తున్న స‌మ‌యంలోనే బాల‌కృష్ణ హీరోగా న‌టించిన నిప్పుర‌వ్వ చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి భారీగానే న‌ష్ట‌పోయింది విజ‌య‌శాంతి.

మంజుల ఘ‌ట్ట‌మ‌నేని :

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల‌. 1999లో రాజ‌స్థాన్ అనే సినిమాలో న‌టించ‌డం ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. స‌మ్మ‌ర్ ఇన్ బెత్లెహెం అనే మ‌ల‌యాళ సినిమాలో క‌థానాయ‌కురాలిగా న‌టించారు. 2002 లో షో సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. షో చిత్రంలో హీరోయిన్‌గా న‌టించమే కాకుండా ఆ చిత్రానికి నిర్మించింది కూడా. ఆ త‌రువాత మ‌హేష్ బాబు న‌టించిన నాని చిత్రాన్ని కూడా నిర్మించింది మంజుల‌. అదేవిధంగా కావ్యాస్ డైరీస్ అనే చిత్రాన్నికూడా నిర్మించింది. ఇక ఆ సినిమాలు ఆమెకు భారీ న‌ష్టాన్ని మిగిల్చాయి.

రోజా :

రోజా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో 100కి పైగా సినిమాల్లో న‌టించింది. డాక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌ర‌స‌న ప్రేమ త‌పస్సు సినిమాలో క‌థానాయిక‌గా చిత్ర రంగ ప్ర‌వేశం చేశారు. ఆ త‌రువాత చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున వంటి అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టించారు. ఇక ఆ త‌రువాత సినీ నిర్మాత‌గా మారారు. త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌మ‌రం అనే చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇక ఆ సినిమా వ‌ల్ల భారీగానే న‌ష్ట‌పోయింద‌ట‌.

శ్రీ‌దేవి :

భార‌తీయ సినీ న‌టి శ్రీ‌దేవి అంద‌రికీ ప‌రిచ‌య‌మే. తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం వంద‌లాది సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టించింది. ఈమె కూడా స‌హ నిర్మాత‌గా కొన్ని చిత్రాల‌ను రూపొందించి కోట్లు న‌ష్ట‌పోయింద‌ట‌.

ఛార్మి :

టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈమె ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించి త‌న కంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. మెహ‌బూబా, పైసావ‌సూల్, తాజాగా లైగ‌ర్ వంటి చిత్రాల‌ను నిర్మించి కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌పోయింది ఛార్మి.

ఇవి కూడా చ‌ద‌వండి :  “గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి” సినిమా నిర్మాతలకు సుప్రీం నోటీసులు ఆ తప్పులే కారణమా..?

సుప్రియ యార్ల‌గ‌డ్డ :

సుప్రియ యార్ల‌గ‌డ్డ గురించి చాలా త‌క్కువ మందికే తెలుసు. ఈమె అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ఇటీవ‌లే రాజ్ త‌రుణ్‌తో అనుభవించు రాజా అనే చిత్రాన్ని నిర్మించి భారీగానే న‌ష్ట‌పోయింది.

ఇవి కూడా చ‌ద‌వండి : ఇద్దరు పిల్లలను వదిలి స్టూడెంట్ తో పారిపోయిన భార్య…భర్త అలా చేయడం తో మైండ్ బ్లాక్….!

Visitors Are Also Reading