Home » Sr.Ntr: రియల్ బాక్స్ ఆఫీస్ కింగ్.. ! పెట్టిన బడ్జెట్ కి ఎన్ని రేట్లు లాభాలు వచ్చాయంటే ?

Sr.Ntr: రియల్ బాక్స్ ఆఫీస్ కింగ్.. ! పెట్టిన బడ్జెట్ కి ఎన్ని రేట్లు లాభాలు వచ్చాయంటే ?

by Anji
Ad

టాలీవుడ్‌లో విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ సాంఘిక పాత్ర‌లతోపాటు పౌరాణిక పాత్ర‌లు వేయ‌డంలో త‌న‌కు తానే తానే సాటి అని నిరూపించుకున్నారు. ఈ రోజుకు కూడా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఒక కృష్ణుడు, ఒక రాముడు, ఒక దుర్యోధ‌నుడు అంటే మ‌న క‌ళ్ల ముందు ఎన్టీఆర్ పోషించిన పాత్ర‌లే గుర్త‌కొస్తాయి. తెలుగు సినిమా చ‌రిత్ర ఉన్నంత కాలం పౌరాణిక పాత్ర‌లు అంటే మ‌న‌కు ముందుగా ఎన్టీఆర్ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. చ‌రిత్ర ఉన్నంత కాలం ఎన్టీఆర్‌కు ఈ విష‌యంలో సాటిరాగ‌ల హీరో ఎవ‌రైనా ఉంటారా..? అంటే క‌నుచూపు మేర‌లో అన్స‌ర్ క‌నిపించ‌దు.

Also Read: చిరంజీవి థియేట‌ర్‌లో బాల‌య్య సినిమా వంద రోజులు.. ఎక్క‌డ‌, ఎప్పుడో తెలుసా..?

Advertisement

ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో దాన‌వీర‌శూరక‌ర్ణ ఒక‌టి. 1977 జ‌న‌వ‌రి 14న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల అయిన సినిమాను ఎన్టీఆర్ రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సొంతంగా నిర్మించారు. ఈ సినిమాకు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు దుర్యోధ‌నుడు క‌ర్ణుడు కృష్ణుడిగా మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టించారు. ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ హ‌రికృష్ణ ఇద్ద‌రు కూడా ఈ సినిమాల్లో న‌టించారు. శ్రీ‌కృష్ణ పాండ‌వీయం సినిమాలో ఎన్టీఆర్ త‌న జీవితంలో ఎప్ప‌టికైనా పూర్తిస్థాయి క‌ర్ణుడు పాత్ర చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఆ కోరిక‌ను ఎన్టీఆర్ దాన‌వీర శూర‌క‌ర్ణతో నెర‌వేర్చుకున్నారు.

Also Read: ఎన్టీఆర్ కృష్ణ మధ్య గొడవలకు కారణం అయిన ఒక్క సినిమా ఏంటో తెలుసా…!

Advertisement


అప్ప‌ట్లో రూ.20 ల‌క్ష‌ల‌తో తీసిన ఈ సినిమాను మూడు సార్లు విడుద‌ల చేశారు. రూ. 20 ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తో తీసిన ఈ సినిమా 15 రెట్లు ఎక్కువ‌గా లాభాలు తీసుకొచ్చింది. అప్ప‌ట్లో రూ.3కోట్ల‌కు పైగా నెట్ వ‌సూలు చేసైఇంది. నాలుగు గంట‌ల‌కు పైగా నిడివితో అప్ప‌ట్లో 25 రీల్స్‌తో తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే కాకుండా భార‌త‌దేశ సినిమా చ‌రిత్ర‌లోనే పెద్ద సినిమాగా రికార్డుల‌ను సృష్టించింది. విచిత్ర‌మేమిటంటే ఎన్టీఆర్ ర‌చ‌న‌, స్క్రీన్‌ప్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా అంత పొడ‌వు ఉన్న ఎక్క‌డ ప్రేక్ష‌కుల‌కు విసుగు లేకుండా ఎన్టీఆర్ త‌న న‌ట‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో మెస్మ‌రైజ్ చేశారు. 9 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ రికార్డు ఏ సినిమాకు రాలేదు.

ఈ సినిమాకు పోటీగా ఇదే మ‌హాభార‌త క‌థ‌తో సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర్‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కురుక్షేత్రం విడుదల అయింది. ఈ సినిమా ప్లాప్ అయింది. అర్జునుడిగా కృష్ణ‌, కృష్ణుడిగా శోభ‌న్‌బాబు, క‌ర్ణుడిగా కృష్ణంరాజు న‌టించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వ‌ర‌రావు సంగీతం స‌మ‌కూర్చారు. రెండు సినిమాలు పోటా పోటీగా వ‌చ్చాయి. క‌ర్ణ సృష్టించిన ప్ర‌భంజ‌నం ముందు కురుక్షేత్రం నిల‌బ‌డ‌లేక ప‌రాజ‌యం పాలైంది. సంక్రాంతి త‌రువాత జ‌న‌వ‌రి 24న రంభ ఊర్వ‌శి మేన‌కా సినిమా విడుద‌ల అయింది. ముర‌ళీమోహ‌న్‌, న‌ర‌సింహ‌రాజు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా రావు గోపాల‌రావు రోజా ర‌మ‌ణి కూడా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. సాంబ‌శివ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా కూడా దాన‌వీర‌శూర‌క‌ర్ణ ప్ర‌భంజ‌నం ముందు నిల‌బ‌డ‌లేక పరాజ‌యం పాలు అయింది.

Also Read : భార్య‌ల‌కు విడాకులు…భ‌ర‌ణంగా కోట్లు! ఎవ‌రెంతిచ్చారంటే?

Visitors Are Also Reading