Home » Kalki 2898 AD : అశ్వత్తామగా అమితాబ్.. లుక్ ని ఆ పవిత్ర ప్రదేశం లో ఎందుకు రిలీజ్ చేశారంటే..?

Kalki 2898 AD : అశ్వత్తామగా అమితాబ్.. లుక్ ని ఆ పవిత్ర ప్రదేశం లో ఎందుకు రిలీజ్ చేశారంటే..?

by Sravya
Ad

Kalki 2898 AD : హీరో ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాతో బిజీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు దీంతో అందరూ ఈ సినిమా గురించి  చర్చించుకుంటున్నారు. సినిమాకి సంబంధించి అమితాబ్ లుక్ ని ఒక పవిత్రమైన ప్రదేశంలో రిలీజ్ చేశారు ఆ ప్రదేశం వెనుక ఉన్న చరిత్ర ఏంటి, అసలు ఎందుకు అక్కడ రిలీజ్ చేశారు అనే ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు చూద్దాం.

Advertisement

కల్కి మూవీలో అశ్వద్ధామ అనే పాత్రలో అమితాబ్ బచ్చన్ కనపడబోతున్నారు. ఈ సినిమా కథ పురాణాలకి సంబంధించింది కనుక సినిమా ఫాంటసీ ఫిక్షన్ గా రూపొందుతోంది. అమితాబ్ లుక్ ని మధ్యప్రదేశ్లోని నేమావార్ ప్రాంతంలో రిలీజ్ చేశారు ఈ లుక్ కి అభిమానులు సినీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అశ్వద్ధామ లుక్ నేమావర్ లోనే రిలీజ్ చేయడానికి కారణం ఉంది. చరిత్రలో అశ్వద్ధామ నడిచిన ప్రాంతంగా భావిస్తారు.

Also read:

Also read:

ఆయన అక్కడే ఉన్న పవిత్రమైన అనుభూతి ఆ ప్రాంతవాసులకి ఉంటుంది. అయితే ఈ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని అమితాబ్ బచ్చన్ లుక్ ని అక్కడ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అమితాబ్ బచ్చన్ స్వయంగా తన సోషల్ మీడియాలో ఈ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నటించిన అనుభూతిని నేను తప్ప ఎవరూ పొందలేరు ఈ ప్రాజెక్ట్ ని తీయాలని ఆలోచన గొప్పది ఆధునిక టెక్నాలజీ తో చిత్రీకరించిన తీరు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. సూపర్ స్టార్ తో కలిసి నటించడం మాటల్లో చెప్పలేనంత ఫీలింగ్ ని ఇచ్చింది అని అమితాబ్ బచ్చన్ స్వయంగా పోస్ట్ చేశారు. వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ 30వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading