Home » తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని ఈ 5 పనులు ఏంటో మీకు తెలుసా..?

తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని ఈ 5 పనులు ఏంటో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే విపరీతంగా కొట్టుకుంటూ మరియు తిట్టుకుంటారు. దీన్ని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరించే అవకాశం ఉంది కాబట్టి, పిల్లల ముందు అలా చేయకూడదు.. పిల్లల ముందు ఈ 5 పనులు అస్సలు చేయకూడదు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. క్రమశిక్షణా రాహిత్యం
ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణ రాహిత్యంతో అస్సలు ప్రవర్తించకూడదు. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే కాబట్టి, తల్లిదండ్రులు ఏ విధంగా మెదిలితే వారు కూడా అదే ఉదాహరణగా తీసుకొని మెదులుతూ ఉంటారు.

2. అబద్ధం చెప్పడం
చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడానికి అబద్దం చెప్పమని పిల్లలను అడుగుతారు. పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారంటే భవిష్యత్తులో కూడా దానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులకు కూడా అబద్దాలు చెప్పడమే ప్రారంభిస్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

3. తప్పుడు పదాలు మాట్లాడకూడదు
సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ తప్పుడు పదాలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా పెద్ద వారి మాటలనే అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు అవి నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

4. పిల్లల ముందు అవమానించ రాదు
దంపతుల మధ్య గొడవలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ దెబ్బలడుతూ ఉంటారు. ఈ సమయంలో భర్త భార్యను అవమానిస్తారు. అలాగే భార్య భర్తను అవమానిస్తుంది. ఇదంతా పిల్లల ముందే చేయడం వల్ల పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి భార్యభర్తలు ఒకరికొకరు గౌరవించుకోవాలి.

5. అసభ్య ప్రవర్తన
పిల్లల ముందే భార్య భర్తలు అసభ్యంగా ప్రవర్తించ కూడదు. అంటే వారి ముందే ఒకరినొకరు పట్టుకోవడం, ఇతరత్రా పనులు చేయడం లాంటివి చేయడం వల్ల పిల్లలకు కూడా అదే మైండ్ లో ఉండిపోతుంది.

ALSO READ;

విడాకుల తరువాత కూడా నాగ చైతన్య సామ్ కోసం అలాంటి పనులు చేస్తున్నాడా ? నిజంగా గ్రేట్

వివాహానికి వధువు, వరుడు యొక్క వయసు ఎంత తేడా ఉండాలో తెలుసా..?

 

Visitors Are Also Reading