విలీనం దిశగా హెచ్‌పీసీఎల్, ఎమ్ఆర్‌పీఎల్

Updated By ManamFri, 05/25/2018 - 22:20
hpcl

hpclన్యూఢిల్లీ: మంగుళూర్ రిఫైనరి అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ (ఎమ్ఆర్‌పీఎల్) ను హస్తగతం చేసుకునేందుకు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఆసక్తి చూపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ విలీనం జరపాలని కంపెనీ భావిస్తోంది.  దీని వల్ల రెండు కంపెనీలకు మంచి ఫలితాలుంటాయని హెచ్‌పీసీఎల్   చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సురానా బుధవారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), ఇండియాలో అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో హెచ్‌పీసీఎల్ ను రూ. 36,915 కోట్లకు ఓ.ఎన్.జి.సి స్వాధీనం చేసుకుంది. ఈ స్వాధీనంతో ఓ.ఎన్.జి.సికి  రెండు చమురు శుద్ధి ( హెచ్‌పీసీఎల్, ఎమ్ఆర్‌పీఎల్ ) అనుబంధ సంస్థలు ఒనగూడినట్లయింది. ఆ రెండింటిని ఒకే గొడుగు కిందకు చేర్చే ప్రయుత్నాలు సాగుతున్నాయి. ఎం.ఆర్.పి.ఎల్ వంటి ఒంటరి చమురు శుద్ధి సంస్థలకు మార్కెటింగ్‌కు సంబంధించిన మౌలిక వసతులు లేకపోవడం, వ్యాపార పరంగా కలిసొచ్చే అంశం కాదని సురానా అన్నారు.   హెచ్‌పీసీఎల్ తాను ఉత్పత్తి చేస్తున్న దానికన్నా ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తులను అమ్ముతోంది. ఎమ్ఆర్‌పీఎల్ ఏడాదికి 15 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఉంది. ఎం.ఆర్.పి.ఎల్‌ను తన గూటి కిందకు తెచ్చుకోవడం వల్ల హెచ్.పి.సి.ఎల్ ఆ వెలితిని భర్తీ చేసుకోగలుగుతుంది. కొరవడుతున్న ఆ భాగాన్ని ప్రస్తుతం అది ఎం.ఆర్.పి.ఎల్‌తో సహా ఇతర చమురు శుద్ధి కర్మాగారాల నుంచి కొనుగోలు చేస్తోంది. ‘‘హెచ్.పి.సి.ఎల్‌లో ఎం.ఆర్.పి.ఎల్‌ని భాగం చేయడం వల్ల సామర్థ్యాలు పెరుగుతాయి. సూత్రప్రాయంగా అది వివేకం అనిపించుకుంటుంది. కానీ, విధి విధానాలను ఇంకా రూపొందించవలసి ఉంది అని సురానా అన్నారు. హిందూస్తాన్ పెట్రోలియం ముంబయిలో (7.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో) ఒక రిఫైనరీని, విశాఖపట్నంలో (8.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో) మరో రిఫైనరీని నిర్వహిస్తోంది. దాని అనుబంధ సంస్థ అయిన హెచ్.పి.సి.ఎల్-మిత్తల్  ఎనర్జీ లిమిటెడ్ పంజాబ్‌లోని భటిండాలో 11.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన రిఫైనరీని నిర్వహిస్తోంది. ఎం.ఆర్.పి.ఎల్ దానితోపాటు 15 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని వెంట తెస్తోంది. హెచ్.పి.సి.ఎల్ ప్రస్తుత లోటు భర్తీ చేసుకునేందుకు ఇది సాయుపడుతుంది.  ముడి చమురు కొనుగోలు, శుద్ధి సామర్థ్యాన్ని సర్వోత్తమంగా వినియోగించుకోవడంలో కూడా ఇరు కంపెనీలకు మేలు జరగనుంది అని సురానా అన్నారు. హెచ్.పి.సి.ఎల్‌ను ఇండిపెండెంట్ లిస్టెడ్ కంపెనీగానే కొనసాగించాలని, డౌన్‌స్ట్రీమ్ యూనిట్ల నన్నింటినీ దాని కింద ఏకీకృతం చేయాలని ఓ.ఎన్.జి.సి భావిస్తోంది.  నిజానికి ఎమ్ఆర్‌పీఎల్‌ను మొదట హెచ్‌పీసీఎల్, ఏ.వీ.బిర్లా గ్రూపులు సంయ్తుంగా నిర్వహించాయి. అయితే, బిర్లా గ్రూపునకు ఉన్న వాటాను 2003 లో ఓఎన్‌జీసీ ప్వాధీన పరుచుకుని తన అనుబంధ సంస్థగా చేసుకుంది. ఎమ్ఆర్‌పీఎల్‌లో హెచ్‌పీసీఎల్ తన వైునారిటీ వాటాను  కొనసాగిస్తూ వచ్చింది. ఎమ్ఆర్‌పీఎల్‌లోలో ఓఎన్‌జీసీకి 71.63 శాతం వాటా, హెచ్‌పీసీఎల్‌కి 16.96 వాటా ఉన్నాయి. ప్రభుత్వానికి చెందిన 51.11 శాతం వాటాను ఓఎన్‌జీసీ కైవసం  చేసుకున్న తర్వాత హెచ్‌పీసీఎల్ దాని అనుబంధ సంస్థగా మారింది.

Tags
English Title
HCLCL to merge, MRPL
Related News