Home » బ్రాహ్మణులు ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా…?

బ్రాహ్మణులు ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా…?

by Ajay
Published: Last Updated on

why Brahmins Don’t Eat Onion and Garlic: బ్రాహ్మణుల కట్టుబాట్లు కఠినంగా ఉంటాయి. చాలా విషయాల్లో వారి అలవాట్లు కూడా వేరుగా ఉంటాయి. ప్రతిరోజు గుడిలోకి వెళ్ళి పూజలు చేస్తారు కాబట్టి ఎంతో నిష్ఠగా ఉంటారు. అంతే కాకుండా బ్రాహ్మణుల ఆహార అలవాట్లు సైతం కఠినంగానే ఉంటాయి. మాంసం, మద్యం అస్సలు ముట్టుకోరు. అయితే ఇవి ముట్టుకోరు అన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ బ్రాహ్మణులు వెల్లుల్లి, ఉల్లిపాయలు సైతం కూరల్లో వేసుకోరు అన్నసంగతి మాత్రం అతి కొద్దిమందికే తెలుసు. అంతే కాకుండా వారి వంటల్లో గరం మసాలాలు కూడా వాడరు అన్న సంగతి ఎవరికీ తెలియదు.

bramhins

అయితే ప్రత్యేక మైన ఆహార అలవాట్లను పాటించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణులు ఉల్లిపాయ వెల్లుల్లి అసలు ఎందుకు తినరు, ఇంటికి తీసుకువెళ్ళరో ఇప్పుడు చూద్దాం….. ఆయుర్వేదం ప్రకారం గా ఆహారాన్ని మూడు భాగాలుగా విభజించారు అవి తాత్విక, రాజసిక మరియు తామసిక వీటిలోని ఒక్కో కేటగిరీలో ఉండే పదార్థాలు మనిషిలోని గుణాలను పెంచడం లేదా తగ్గించడం చేస్తాయి. అలా వెల్లుల్లి, ఉల్లిపాయ లో ఉండే గుణాలు కామాన్ని పెంచడంలో సహాయపడతాయి.అవసరం అయిన దానికంటే ఆ గుణం ఎక్కువ అయితే ఒక విషయం

why brahmins don’t eat onion and garlic

why brahmins don’t eat onion and garlic

పై మనసును లగ్నం చేయడం చాలా కష్టం కాబట్టి ఉల్లిపాయను, వెల్లుల్లి ని ఆహారంలో భాగంగా తీసుకోరు మరియు దేవుడికి కూడా పెట్టే నైవేద్యం లోనూ వెల్లుల్లి, ఉల్లిపాయను ఉపయోగించరు. అంతే కాకుండా ఉల్లిపాయలు, వెల్లుల్లి భూమిలో వేర్లకు పెరుగుతాయి. వాటి వెర్లకు ఎన్నో పురుగులు సైతం ఉంటాయి. కాబట్టి వాటిని మలినమైన వాటిగా చూస్తారని కూడా చెబుతుంటారు.


You may also like