Home » Venu swamy : ఆ మెగా జంట పెళ్లి పెటాకులు అవుతుంది.. కుండబద్దలు కొట్టిన వేణుస్వామి..!

Venu swamy : ఆ మెగా జంట పెళ్లి పెటాకులు అవుతుంది.. కుండబద్దలు కొట్టిన వేణుస్వామి..!

by Sravya
Ad

Venu swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిపోయారు. వేణు స్వామి ఇప్పటికే చాలామంది హీరోలు హీరోయిన్ల గురించి జాతకాలు చెప్పారు. వేణు స్వామి చెప్పింది జరగడంతో వేణు స్వామి చెప్పేవన్నీ కచ్చితంగా జరుగుతాయని అంతా భావిస్తూ ఉంటారు. సమంత నాగ చైతన్య విడిపోతారని ముందే చెప్పేసారు వేణు స్వామి ఇప్పుడు మెగా ఫ్యామిలీ లో ఒక జంట విడిపోతారని సంచలన కామెంట్స్ చేశారు వేణు స్వామి. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల గురించి చెప్పారు.

venuswamy

Advertisement

లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ విడిపోతారని అన్నారు వీరి జాతకంలో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాయని నాకు తెలిసిన వాళ్ళు కలిసి ఉండలేరని వేణు స్వామి చెప్పారు. లావణ్య కి కుజదోషం వుంది. వరుణ్ తేజ్ కి నాగ దోషం ఉంది దీంతో వీళ్ళిద్దరూ కలిసే ఉండే అవకాశం లేదని అన్నారు. అసలు వీళ్ళకి పెళ్లి యోగమే లేదని అలాంటి వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఒక అద్భుతం అని వేణు స్వామి అన్నారు.

Also read:

Advertisement

Also read:

నేనేం చెప్పినా కూడా జాతకం ప్రకారం చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదని వేణు స్వామి అన్నారు. కాస్త ఆలస్యమైనా వీళ్ళు విడిపోతారని వేణు స్వామి అన్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల విషయంలో తాను చెప్పిన మాటలు నిజం అవుతాయని వేణు స్వామి కుండబద్దలు కొట్టారు. మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని కూడా వేణు స్వామి ముందే చెప్పారు. ఆమె విషయంలో వేణు స్వామి చెప్పినట్లు జరిగింది. ఇక వరుణ్ తేజ్ కూడా విడాకులు తీసుకుంటాడని చెప్పడంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి విడిపోతారని చెప్పడంతో వేణు స్వామి మీద మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading