aamir khan

ఆమిర్ చేతిలో ‘మహాభారతం’.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా..?

Updated By ManamMon, 08/06/2018 - 12:56

Aamir Khanమహాభారతం.. భారతదేశంలోని చాలా మంది నటీనటులు, దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అందులో రాజమౌళి, ఆమిర్ ఖాన్, మోహన్‌లాల్ తదితరులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని రాజమౌళి ఒకసారి తెలపగా.. ఏదో ఒకరోజు మహాభారతం చేయాలనుందని ఆమిర్ కూడా పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఇద్దరి కాంబినేషన్లోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే దానికి సంబంధించిన పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కానీ తాజాగా ఆమిర్‌ను చూస్తుంటే ఆ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. 

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమిర్‌ఖాన్ ఓ బుక్ పట్టుకొని కనిపించారు. దానిమీద ‘కండెన్స్‌డ్ మహాభారత ఆఫ్ వ్యాస’ అని రాసి ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు ఆమిర్ ఖాన్ సిద్ధమయ్యాడని పలువురు బాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మహాభారతాన్ని తెరకెక్కిస్తే అందుకు వెయ్యి కోట్లు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.షారూక్ ముద్దాడుతున్న ఆ నటి ఎవరబ్బా..?

Updated By ManamWed, 06/13/2018 - 10:57

shah rukh బాలీవుడ్ నటులు షారూక్, గుల్షన్ గ్రోవర్‌లు ఓ నటిని ముద్దాడేందుకు పోటీ పడుతున్న ఫొటో ఒకటి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ ఫొటోలో ఉన్న నటి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీశారు. వారిలో కొందరు సమాధానాన్ని చెప్పగా, మరొకొందరు దాని వెనుక కథను కూడా చెప్పేస్తున్నారు. ఇంతకు ఆ కహాని ఏమిటి, ఆ నటి ఎవరు అంటే..

అక్కడున్నది మరెవరో కాదు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. 1995లో అశుతోశ్ గోవారికర్ తీసిన బాజీ చిత్రంలో ఓ సన్నివేశం కోసం ఆమిర్ అమ్మాయి వేషం వేసుకున్నాడు. ఆ వేషంలోనే ఉన్న ఆమిర్‌ను షూటింగ్ తరువాత షారూక్, గుల్షన్‌లు ముద్దాడుతూ ఓ ఫొటో తీసుకున్నారు. ఇదే ఫొటో తాజాగా వైరల్‌ అయ్యింది.కుమార్తెతో ఆమిర్ ‘దంగల్’ ఫోజు.. నెటిజన్ల విమర్శలు

Updated By ManamThu, 05/31/2018 - 12:22

Aamir khan బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ వివాదాలకు కాస్త దూరంగానే ఉంటారు. అయితే ఇటీవల అతడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటోపై తాజాగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆ ఫొటోలో తన కుమార్తె ఇరా ఖాన్‌తో కలిసి ఆమిర్ స్పోర్ట్స్ మూడ్‌లో ఉండగా.. ఇలాంటి ఫోజ్‌లు ఏంటంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

అయితే అమీర్ కజిన్ అయిన మన్సూర్ ఖాన్ పుట్టినరోజు వేడుకల్లో ఇటీవల ఆమిర్ ఖాన్‌ కుటుంబంతో సహా పాల్గొన్నాడు. అక్కడ తన కుమార్తెతో దంగల్ సీన్‌ను తలపించేలా ఓ ఫోజ్‌ను పెట్టాడు. దానికి సంబంధించిన ఫొటోనే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అసభ్యకరంగా ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక కొంతమందైతే ‘ఎంత కుమార్తె అయినా అలాంటి ఫోజులేంటి’, ‘రంజాన్ మాసంలో ఇలాంటి ఆటలేంటి‘, ‘కనీసం ఇరా ఖాన్ మంచి దుస్తులైన వేసుకొని ఉండాల్సింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ‘ఓ తండ్రి తన కుమార్తెను ప్రేమించకూడదా ఇదే ఫొటోలో కొడుకు ఉండి ఉంటే ఇలాంటి విమర్శలు చేసేవారా’ అంటూ కొందరు ఆమిర్‌కు మద్దతును ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 అందుకే సంజయ్ బయోపిక్‌లో నటించలేదు

Updated By ManamFri, 05/25/2018 - 10:24

Aamir Khan  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంజు’. రణ్‌బీర్ కపూర్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అనుష్క శర్మ, సోనమ్ కపూర్, మనీషా కొయిరాలా, పరేశ్ రావల్, మాధురీ దీక్షిత్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా మీడియాతో పంచుకున్నాడు మిస్టర్ పర్‌ఫెక్షనిస్టు ఆమీర్ ఖాన్.

సంజయ్ దత్ సినిమాను తెరకెక్కించాలనుకున్నప్పుడు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తనను కలుసుకొని, ఈ చిత్రంతో భాగస్వామి అవ్వాలని కోరారని, అందుకోసం సంజయ్ దత్ తండ్రి పాత్ర సునీల్ దత్ పాత్రను చేయమని అడిగారని ఆమీర్ తెలిపారు. నిజానికి చెప్పాలంటే సునీల్ దత్ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, కానీ రణ్‌బీర్‌కు తండ్రిగా అనగానే వెనుకడగు వేశానని పేర్కొన్నారు. పాత్రల ఎంపికలో తనకు పరిధులు ఉన్నందునే సంజయ్ దత్ బయోపిక్‌లో నటించలేకపోయానని అన్నారు. ఇక సంజయ్ పాత్రకు రణ్‌బీర్ సరిగ్గా సరిపోయారని కితాబిచ్చారు.
 
 మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌కు 30 ఏళ్ళు

Updated By ManamSun, 04/29/2018 - 16:41

aamirసినిమా సినిమాకి న‌టుడిగా ఎద‌గ‌డం అనేది అతి త‌క్కువ మందిలో చూస్తుంటాం. అలాంటి అరుదైన క‌థానాయ‌కుల్లో బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ ఒక‌రు. ల‌వ‌ర్ బోయ్‌, ట‌పోరి, ఐపీఎస్ ఆఫీస‌ర్‌, విలేజ‌ర్‌, ఫ్రీడ‌మ్ ఫైట‌ర్‌, టెర్ర‌రిస్ట్‌, ఆర్ట్ టీచ‌ర్‌, ఇంజ‌నీర్‌, రెజ్ల‌ర్‌, రాక్ స్టార్‌.. ఇలా క్యారెక్ట‌ర్ ఏదైనా ఆ పాత్ర కోసం నూటికి నూరు శాతం ఎఫ‌ర్ట్ పెట్టే క‌థానాయ‌కుడు అమీర్‌. 'ఖ‌యామ‌త్ సే ఖ‌యామ‌త్ త‌క్' (ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టి సినిమా 'అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి'కి ఈ సినిమానే ఆధారం)తో హీరోగా తొలి అడుగులు వేసిన అమీర్‌.. ఆ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా, 'ఉత్త‌మ నూత‌న న‌టుడి'గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును, స్పెష‌ల్ మెన్ష‌న్ కేట‌గిరిలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. జూహీ చావ్లా క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాకి మ‌న్సూర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆనంద్ - మిలింద్ సంగీత‌మందించిన ఈ సినిమా ఏప్రిల్ 29, 1988న విడుద‌లైంది. అంటే.. క‌థానాయ‌కుడిగా అమీర్ ప్ర‌యాణం మొద‌లై నేటితో 30 ఏళ్ళు పూర్త‌వుతోంద‌న్న‌మాట‌.  అభిమానులకు సానియా శుభవార్త.. 

Updated By ManamMon, 04/23/2018 - 21:16

Sania Mirza is pregnant, tennis queen announces motherhood in style

భారత టెన్నీస్ సంచలనం, గ్రాండ్ స్లామ్స్ విజేత సానియా.. తన అభిమానులకు సోమవారం సాయంత్రం శుభవార్త అందించింది. తాను తల్లి కాబోతున్నట్లు ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా ఆమే తెలిపింది. తమ జీవితంలోకి ఒక బేబీ రానుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు ఆనందంతో రీట్వీట్స్ చేశారు. ఇదిలా ఉంటే సానియాకు పలువురు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ తెలియజేశారు.

ఈ పోస్టుకు తోడుగా..  ఇటు సానియా, అటు షోయబ్ మాలిక్‌ల దుస్తులు ఉండగా... మధ్యలో మీర్జా-మాలిక్ పేరుతో బుడ్డి డ్రెస్ ఉన్న ఫొటో ట్వీట్ చేసింది. మరోవైపు 'బేబేమీర్జామాలిక్' పేరుతో హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది. ఒకానొక సందర్భంలో.. తనకు సంతానం కలిగితే ఆ బిడ్డ ఇంటి పేరు మీర్జా మాలిక్ అని పెడుతామని సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే మాటపై తమ సంతానానికి మీర్జా మాలిక్ అనే ఇంటి పేరు పెడుతున్నట్లు వీరి తాజా పోస్ట్‌లు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. గర్భం దాల్చిన విషయాన్ని సానియా.. ప్రకటించిన వెంటనే ఆ జంటను అభినందిస్తూ బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు షోయాబ్ మాలిక్ కూడా సేమ్ ఇదే ట్వీట్‌ను పోస్ట్ చేశాడు.

 క‌త్రినా కైఫ్.. పండ‌గ‌లే పండగ‌లు

Updated By ManamSun, 04/08/2018 - 21:19

katrina kaifక‌త్తి లాంటి చూపుల‌తో యువ‌త‌ని కైపెక్కించే అందం క‌త్రినా కైఫ్ సొంతం. 15 ఏళ్ళ క్రితం 'బూమ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన క‌త్రినాకి మొద‌టి సినిమా విజ‌యాన్ని ఇవ్వ‌లేదు స‌రిక‌దా.. విమ‌ర్శల్లోకి, వివాదాల్లోకి నెట్టింది. క‌ట్ చేస్తే.. రెండో చిత్రాన్ని తెలుగులో 'మ‌ల్లీశ్వ‌రి'గా చేసి తొలి విజ‌యాన్ని అందుకుంది క‌త్రినా. మ‌ళ్ళీ బాలీవుడ్‌కి వెళ్ళిన‌ ఈ బ్యూటీకి రెండో హిందీ చిత్రం 'స‌ర్కార్' మంచి విజ‌యాన్ని అందించింది. దీంతో.. చిత్ర సీమ‌లో ఇక వెనుతిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు ఈ ముద్దుగుమ్మ‌కి. న‌ట‌న‌, న‌ర్త‌న విష‌యంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న క‌త్రినా.. తాజాగా ఓ విష‌యంలో వార్త‌ల్లో నిలుస్తోంది.

అదేమిటంటే.. ఏడాది గ్యాప్‌లో ముగ్గురు ఖాన్‌ల‌తో తెర‌పై సంద‌డి చేయ‌డం.  విశేష‌మేమిటంటే.. ఈ మూడు సినిమాలు కూడా పండ‌గ సంద‌ర్భాల్లోనే విడుద‌ల కావ‌డం. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. గ‌త డిసెంబ‌ర్ 22న క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌లైన‌  'టైగ‌ర్ జిందా హై'లో స‌ల్మాన్ ఖాన్‌కు జోడీగా న‌టించిన క‌త్రినాకి ఆ సినిమా మంచి విజ‌యాన్ని అందించింది. ఇక అమీర్ ఖాన్‌కు జోడీగా న‌టిస్తున్న 'థ‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్' దీపావ‌ళి కానుక‌గా  ఈ న‌వంబ‌ర్ 7న రిలీజ్ కానుంది. అలాగే షారుక్ ఖాన్‌కు జోడీగా న‌టిస్తున్న 'జీరో' క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్  21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మొత్తానికి.. ఏడాది గ్యాప్‌లో ముగ్గురు ఖాన్‌ల‌తో పండ‌గ సంద‌ర్భాల్లోనే క‌త్రినా సంద‌డి చేస్తుండ‌డం విశేషంగానే చెప్పాలి. స‌ల్మాన్‌కే కాకుండా అమీర్‌, షారుక్‌కు కూడా గ‌తంలో క‌లిసొచ్చిన క‌త్రినా.. తాజా చిత్రాల‌తో ఆ పరంప‌ర‌ని కొన‌సాగిస్తుందేమో చూడాలి.ఇర్ఫాన్ కోసం ఖాన్ త్రయం

Updated By ManamTue, 04/03/2018 - 19:09

irffan khanఅంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ నటించిన తాజా చిత్రం ‘బ్లాక్‌మెయిల్’. ఏప్రిల్ 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ఇర్ఫాన్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఇర్ఫాన్ తనకు న్యూరో ఎండోక్రైన్ వ్యాధి ఉందని గుర్తించారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స నిమిత్తం యు.కె.లో ఉన్నారు ఇర్ఫాన్. తమ సహ నటుడికి ఎదురైన సమస్యకు బాలీవుడ్ స్పందించింది.

khanముఖ్యంగా బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ తమ వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఈ ఖాన్ త్రయం ‘బ్లాక్‌మెయిల్’ చిత్రాన్ని ప్రత్యేకంగా చూడబోతున్నారు. అంతేకాదు ప్రమోషన్ పరంగా తమ పూర్తి సపోర్ట్‌ని ఇర్ఫాన్‌కి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. తోటి నటుడి కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించి.. సినిమా ప్రచారంలో పాల్గొనడం ఎంతో అభినందనీయమని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమీర్‌పై విమ‌ర్శ‌కుల‌కు స్పందించిన జావేద్‌

Updated By ManamFri, 03/23/2018 - 22:18

aamir khanహిందువుల పురాణ‌మైన మ‌హాభార‌తాన్ని సెల్యూలాయిడ్‌పై ఆవిష్క‌రించాల‌ని ఉంద‌ని.. ఇది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అని బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ చాలాసార్లు బాహాటంగానే ప్రకటించారు. అంతేకాదు.. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు పాత్ర పోషించాలని ఉందని కూడా ఆమీర్ వెల్లడించారు. దాదాపు రూ.1000 కోట్లకు బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిర్మించనున్నారని సమాచారం.

అయితే.. ఈ విషయమై ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కాలమిస్ట్ ఫ్రాంకాయిన్ గాటియర్ ట్విట్టర్ ద్వారా “ఆమీర్ ఓ ముస్లిం. హిందువులకు ఎంతో పవిత్రమైన మహాభారతంలో త‌ను నటించడమేమిటి? మహమ్మద్ క్యారెక్ట‌ర్‌లో హిందువు నటించేందుకు ముస్లింలు ఒప్పుకుంటారా”? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ధీటుగా స్పందించారు బాలీవుడ్ నటుడు, గేయ రచయిత జావేద్ అఖ్త‌ర్. “దుష్టుడా.. ఫ్రాన్స్‌కు చెందిన పీటర్ బ్రూక్స్ రూపొందించిన ‘ది మహాభారత్’ ను చూడలేదా? మా దేశానికి సంబంధించి ఇటువంటి విషపూరితమైన ఆలోచనలను విస్తరింపచేయమని ఏ విదేశీ ఏజెన్సీ నీకు డబ్బులిస్తోంది?’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.'మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌'ను మెప్పించిన చిత్రం

Updated By ManamFri, 03/23/2018 - 09:28

aamir khan బాలీవుడ్‌లో తాజాగా వచ్చిన ఓ సినిమా మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రశంసలు కురిపిస్తున్నాడు. అంతేకాదు ఆ సినిమాను మిస్ అవ్వకండి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. మరి ఆమిర్‌ఖాన్‌ను అంతలా మెప్పించిన ఆ చిత్రమేంటి అనుకుంటున్నారా..? రాణి ముఖర్జీ నటించిన 'హిచ్‌కి'.

ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. గురువారం స్పెషల్ షోను చూశాడు ఆమిర్ ఖాన్. ఈ సందర్భంగా.. "చాలా రోజుల తరువాత ఒక ఎంజాయబుల్ చిత్రాన్ని చూశాను. మంచి చిత్రం, అందరూ బాగా నటించారు. సినిమా ఆద్యంతం చాలా బావుంది. దీన్ని ఎవరూ మిస్ అవ్వకండి. రాణి, సిద్ధార్థ్, నీరజ్ కబి, చిత్రంలో నటించిన విద్యార్థులందరికీ థ్యాంక్స్" అంటూ అమీర్ ట్వీట్ చేశారు. కాగా ఈ చిత్రంలో రాణి ముఖర్జీ వెక్కిళ్లతో బాధపడే టీచర్‌ పాత్రలో కనిపించనుంది.

Related News