pakistan

అయితే పాకిస్థాన్ వెళ్లి ఇమ్రాన్ కేబినెట్‌లో చేరు

Updated By ManamMon, 10/15/2018 - 09:16

Navjot Singhదక్షిణాది రాష్ట్రాలకు వెళ్లడం కంటే పాకిస్థాన్‌కు వెళ్లడం మేలంటూ కాంగ్రెస్ నేత సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు కొనసాగుతున్నాయి. సిద్ధూ తన వ్యాఖ్యలతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధూ మాటల్లో కుట్ర దాగి ఉందని.. నిజంగా అతడికి పాకిస్థాన్‌పై అంత ప్రేమ ఉంటే ఆ దేశంకు వెళ్లి ఇమ్రాన్ కేబినెట్‌లో చేరాలని సూచించారు.

మరోవైపు దక్షిణ భారతదేశాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూతో పాటు, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి మురళీధరన్ శివలింగం స్పందిస్తూ.. అతడో కమెడియన్‌ అని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.పాక్ ఐఎస్‌ఐ చీఫ్‌గా అసీం మునీర్

Updated By ManamWed, 10/10/2018 - 19:32
Lt General Asim Munir Appointed Head Of Pakistan ISI

ఇస్లామామాబాద్ : పాకిస్థాన్‌లో అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ విభాగం (ఐఎస్‌ఐ) నూతన అధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ అసీం మునీర్ బుధవారం నియమితులయ్యారు. మునీర్ గతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్‌గా పని చేవారు. ప్రస్తుతం ఐఎస్‌ఐ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తార్ ఉన్నారు. ఆయన స్థానంలో మునీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వివిధ విభాగాల బదిలీల ప్రక్రియలో భాగంగా ఈ నియామకం చోటు చేసుకుందని సైన్యాధికారులు తెలిపారు.పాక్ దుస్సాహసం?

Updated By ManamMon, 10/01/2018 - 04:03
 • భారత గగనతలంలోకి పాక్ చాపర్

 • పూంఛ్ సెక్టార్‌లోకి వచ్చిన వైనం

 • కిలోమీటరు దూరం వరకు రాక

 • చిన్న ఆయధాలతో తరిమివేత

 • మధ్యాహ్నం సమయంలో ఘటన

 • పైలట్ పొరపాటు కావచ్చని అంచనా

pak-helicaptorజమ్ము: జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ హెలికాప్టర్ భారతీయ గగనతలంలోకి వచ్చింది. భారత ఆర్మీ వర్గాలు చిన్న ఆయుధాలతోనే దాన్ని తరివేుసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. నియంత్రణ రేఖ నుంచి ఒక కిలోమీటరు దాటి హెలికాప్టర్లు, పది కిలోమీటర్లు దాటి విమానాలు వేరే దేశం గగనతలంలోకి రాకూడదని భారత్, పాకిస్థాన్ ఇంతకుముందే కొన్ని నిబంధనలు విధించుకున్నాయి. కానీ తెల్లటి పాకిస్థానీ హెలికాప్టర్ మాత్రం బాగా ఎత్తులో ఎగురుతూ పూంఛ్‌లోని ఒక పర్వతం వైపు వచ్చింది. ఆ వెంటనే తుపాకులు పేలిన శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. మధ్యాహ్నం 12.13 గంటల సమయంలో తొలిసారి ఈ హెలికాప్టర్ కనిపించిందని, దాన్ని ఆర్మీ వర్గాలు కూల్చేసే ప్రయత్నం చేయడంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌వైపు వెళ్లిపోయిందని తెలిసింది. అయితే, కేవలం చిన్న తుపాకులతోనే దాన్ని కాల్చారు తప్ప.. పెద్ద స్థాయి యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాలు మాత్రం భారత ఆర్మీ ఉపయోగించలేదని తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో కూడా ఒక పాకిస్థానీ హెలికాప్టర్ నియంత్రణ రేఖ నుంచి 300 మీటర్ల లోపలకు వచ్చింది. కానీ గతంతో పోలిస్తే ఆదివారం వచ్చినది మాత్రం మరింత లోపలకు రావడంతో దీన్ని గగనతల ఉల్లంఘనగానే భావిస్తున్నారు. పాకిస్థాన్ కాస్త దూకుడుమీద కనిపిస్తోందని, ఇలా గగనతలాన్ని ఉల్లంఘించడం చాలా తీవ్రమైన అంశమని రిటైర్డ్ మేజర్ జనరల్ అశ్వనీ సివాచ్ తెలిపారు. భారత గగనతలంలోకి అది ఎంత దూరం వచ్చిందన్నదాన్ని బట్టి ఉల్లంఘన తీవ్రతను పరిగణిస్తారని, అప్పుడే అది రెక్కీనా, నిఘానా, లేక చొరబాటుయత్నమా అనేది చెప్పగలమని ఆయన వివరించారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండానే చిన్న విమానాలు, హెలికాప్టర్లు దారితప్పి వేరే గగనతలంలోకి వస్తాయి. నేవిగేషన్ సమస్యల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందని, అది పైలట్ తప్పిదమే అవుతుందని అశ్వనీ సివాచ్ చెప్పారు. చిన్న హెలికాప్టర్లకు నేవిగేషన్‌ను మాన్యువల్‌గా చేస్తారని.. అప్పుడు వాళ్లు నేలమీద కనపడే బండగుర్తులను బట్టి వెళ్తారని తెలిపారు.ఇమ్రాన్.. ఓ చప్రాసీ

Updated By ManamSun, 09/30/2018 - 22:18
 • ఆయన ఓ పేపర్ ప్రధాని

 • ఐఎస్‌ఐ, సైన్యానిదే అధికారం

 • బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి

subramaniyam swamiన్యూఢిల్లీ: పాకిస్థాన్‌ను ఐఎస్‌ఐ, ఉగ్రవాదులే నడిపిస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అలాంటి దేశంతో చర్చలు జరిపే ఆలోచనే కేంద్రానికి లేదని అన్నారు. పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. కేవలం పేపర్‌పైనే ప్రధాని అని అన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇమ్రాన్ ఖాన్ ఓ చప్రాసీ వంటివాడు. అధికారమంతా ఐఎస్‌ఐ, సైన్యం చేతుల్లోనే ఉంటుంది.  అవి చెప్పినట్లు ఇమ్రాన్ వ్యవహరిస్తారు’’ అని పేర్కొన్నారు. బలూచీలను, సింధీలను భారత్ అధికారికంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్థాన్ తప్పులను ఎత్తిచూపినప్పుడల్లా  ఆ దేశం ఒత్తిడికిగురై ఏవేవో ఆరోపణలు చేస్తుందని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు భారత్ అండగా నిలుస్తుందని, అయితే.. అక్కడి హిందూ ఆలయాలను కూల్చివేతలను ఆమె అడ్డుకోవాలని అన్నారు. అలాగే హిందువులను ఇస్లాంలోకి మార్చేవారిపై చర్య తీసుకోవాలని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు హిందూత్వం, అవినీతి మధ్య జరిగే పోరని పేర్కొన్నారు.గెలిస్తే ఫైనల్‌కు

Updated By ManamTue, 09/25/2018 - 23:30
 • స్టార్‌స్పోర్ట్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం

 • నేడు పాకిస్థాన్- బంగ్లాదేశ్‌ల మధ్య సెమీఫైనల్ పోరు

imageఅబుదాబి: ఆసియా కప్‌లో మరో రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. భారత్ చేతిలో వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్ జట్టు బుధవారం జరగబోయే సెమీఫైనల్‌లో పసికూన బంగ్లాదేశ్‌పై పోరుకు సిద్ధమైంది. బంగ్లాతో జరిగే ఈ సెమీస్‌లో విజయం సాధించి ఫైనల్‌లో భారత్‌ను ఓడించాలనే కసితో పాక్ జట్టు ఉంది. మరో పక్క అప్ఘా నిస్థాన్‌పై విజ యంతో దూకుడు మీదున్న బంగ్లా జట్టు పాకిస్థాన్‌ను ఓడించి టీమిండి యాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. పాక్ జట్టు బ్యాటిం గ్‌లోనూ, బౌలింగ్ లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సూపర్ -4లో భారత్‌తో జరి గిన మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ టీమిండియా బౌలర్లను ఎదుర్కొవటంలో పూర్తిగా విఫల మవ్వగా, భారత్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీయ డంలో ఫెయిలైంది. షోయబ్ మాలిక్ తప్ప పాకి స్థాన్ జట్టులో మరో బ్యాట్స్‌మన్ సరైన ఫామ్‌లో లేడు.ఇక అఫ్ఘాన్ మ్యాచ్‌లో మూడు పరు గుల విజయంతో దూకుడు మీదన్న బం గ్లా పాక్‌తో జరగబోయే సెమీస్‌లో అదే జోరును కొనసాగించాలని చూస్తోంది.

పాకిస్థాన్: ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్, మసూద్, సర్ఫరాజ్ అహ్మద్ (కె), షోయబ్ మాలిక్, సోహెల్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రామ్, హసన్ అలీ, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అసిఫ్ అలీ, మహ్మద్ అమీర్.

బంగ్లాదేశ్: మొర్తజా (కె), షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బా ల్, మహ్మద్ మిథున్, లిటన్ దాస్, ముష్ఫీకర్ రహీమ్, అర్ఫిల్, మహ్మదుల్లా, హోస్సెన్, నజ్ముల్లా, హసన్ మీరజ్, నజ్ముల్ ఇస్లామ్, రూబెల్, ముస్తాఫిజుర్, రోని.మారకుంటే మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదు

Updated By ManamMon, 09/24/2018 - 14:48

Bipin Rawatన్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ దుశ్చర్యలపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మరోసారి మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోందని, సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. సైన్యాన్ని, ఐఎస్‌ఐను ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం అదుపులో పెట్టుకోవాలని లేకపోతే మరోసారి సర్జికల్ స్ట్రైక్ తప్పవు అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సైన్యంతో పోరాడలేక అన్యాయంగా పోలీస్ ఆఫీసర్లను ఎత్తుకెళ్తూ వారిని దారుణంగా చంపుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

అయితే గత గురువారం ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, ఒక కానిస్టేబుల్‌ను అపహరించిన పాక్ ఉగ్రవాదులు వారిని దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అంతకుముందు సరిహద్దుల్లో కూడా ఓ జవాన్‌ను ఉగ్రమూక చంపింది. దీంతో న్యూయార్క్‌లో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి షా మెహమూద్ ఖురేషి, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్య జరగాల్సిన సమావేశాన్ని భారత్ రద్దు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.పోలీసుల హత్య వెనుక పాక్!

Updated By ManamSun, 09/23/2018 - 23:48
 • బలగాలను హతమార్చాలని ఐఎస్‌ఐ ఆదేశాలు

 • ఆ క్రమంలోనే కశ్మీర్‌లో మగ్గురు పోలీసుల హత్య

 • గుర్తించిన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు

PAK-ISIన్యూఢిల్లీ: జమ్మూకశ్మీరులో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను చంపాలని ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి ఆదేశాలు వస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) నుంచి వస్తున్న ఆదేశాలను భారత నిఘా వర్గాలు అడ్డుకుని వినగలిగాయి. దీంతో కశ్మీరులోని ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి వస్తున్న ఆదేశాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. ఈ కారణంతోనే న్యూయార్క్‌లో జరగవలసిన భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ రద్దు చేసుకున్నట్లుగా తెలిసింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకూ ఇటీవల జమ్మూ-కశ్మీరు పోలీసులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. రాజీనామా చేయండి, లేదా, చావండి అంటూ హెచ్చరించాడు. ఈ హెచ్చరిక వెలువడిన రెండు రోజుల్లోనే ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను అపహరించి, హత్య చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్‌లోని వ్యక్తులు ఈ పోలీసుల హత్యలకు ప్రణాళికను రచించి, కశ్మీరు ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అపహరించిన ముగ్గురు పోలీసులను వెంటనే చంపేయాలని, సాధారణ పౌరుడిని విడిచిపెట్టాలని పాకిస్థాన్‌లోని వ్యక్తులే ఇక్కడి ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. జమ్మూ-కశ్మీరులో స్థానిక ఎన్నికలు జరగకుండా నిరోధించడమే లక్ష్యంగా పాకిస్థాన్ వర్గాలు పని చేస్తున్నట్లు భారతీయ నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇదే లక్ష్యంతో పోలీసులను హత్య చేశారని తెలిపాయి. సైనికుల పేర్లను ఉగ్రవాదులకు చేరవేసి పక్కా ప్రణాళిక ప్రకారమే వారిని హతమార్చినట్లు ఐబీ వెల్లడించింది. ముందుగా వారిని విధుల నుంచి వైదొలగాల్సిందిగా ఉగ్రవాదులు హెచ్చరించారని అయినా కూడా జవాన్లు వారి బెదిరింపులకు లొంగకపోవడంతో కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాకిస్తాన్ నైజాం మరోసారి బహిర్గతమైంది. కాగా, పాక్ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాక్ తీరుకు ఖచ్చితంగా తూటాలతోనే సమాధానం చెప్తామని ఆర్మీ ప్రకటించింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సరిహద్దులో భారత సైన్యం భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్‌తో జరగాల్సిన చర్చలను భారత్ రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలతో భారత్‌పై విరుచుకుపడ్డారు. భారత్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని.. తక్కువ స్థాయి కలిగిన వ్యక్తులు ఉన్నత స్థాయి పదవిలో ఉంటే ఇలానే ఉంటుందని మోదీపై ఇమ్రాన్ విషంగక్కారు.పాకిస్తాన్‌తో భారత్ భేటీ రద్దు

Updated By ManamFri, 09/21/2018 - 17:53
India Calls Off Talks With Pak

న్యూఢిల్లీ : ఓ వైపు శాంతి చర్చలు జరుపుదామంటూ...మరోవైపు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ వైఖరిని భారత్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో వచ్చేవారం న్యూయార్క్‌లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో జరగాల్సిన భారత విదేశాంగ మంత్రి భేటీని భారత్ రద్దు చేసింది. కాగా భారత్, పాక్ మధ్య మళ్లీ శాంతి చర్చల ప్రక్రియ  కొనసాగించాలన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ...ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. 

దీంతో పాక్ అభ్యర్థనకు భారత్ అంగీకారం తెలిపింది. అయితే జమ్ముకశ్మీర్‌‌లో పాక్ రేంజర్లు భారత జవాన్లను ఊచకోత కోస్తుండటం, మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లో పోలీసులను హతమార్చడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన భారత్.. ఆ భేటీని అర్ధంతరంగా రద్దు చేసింది. మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ లేఖ

Updated By ManamThu, 09/20/2018 - 14:03
 • ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పునప్రారంభిద్దామని పిలుపు

Imran Khan letter to Narendra Modi

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్... భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.  భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు తిరిగి పునరుద్దరించాలని ఇమ్రాన్ తన లేఖలో కోరారు. అయితే పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ శాంతి చర్చలు తిరిగి ప్రారంభిద్దామంటూ తొలిసారి లేఖ రాయడం విశేషం. 

ఈ నెలలో న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ కోసం ప్రయత్నాలు చేయాలంటూ ఇమ్రాన్ తన లేఖలో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి ఘటన ఇరుదేశాల మధ్య  శాంతి చర్చలు నిలిచిపోయాయి. ఆ తర్వాత నుంచి భారత్-పాక్ మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేవు. అయితే ఇప్పటికే ప్రధాని మోదీ పాక్‌తో స్నేహపూరిత బంధాన్ని ఆశిస్తున్నామంటూ ఇమ్రాన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.విజృంభించిన టీమిండియా.. చిత్తుగా ఓడిన పాక్

Updated By ManamWed, 09/19/2018 - 20:43

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అవగా 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ధవన్, రోహిత్‌లు కలిసి తొలి వికెట్‌కి 86 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. షాదబ్ వేసిన 14వ ఓవర్ తొలి బంతికి రోహిత్ శర్మ(52) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

image


ఆ తర్వాత ధవన్ అదరగొట్టాడు. రోహిత్ వికెట్ తర్వాత వేగం పెంచిన ధవన్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 46 పరుగులు చేసి ఫమీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో బాబర్ ఆజామ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్, అంబటి రాయుడుల జోడీ జట్టుకి విజయాన్ని కట్టబెట్టింది. మూడో వికెట్‌కి వీరిద్దరు కలిసి 60 పరుగులు జోడించారు. దీంతో భారత్ 29 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నమెంట్ సూపర్ ఫోర్ మ్యాచుల్లో భాగంగా ఈ నెల 23న భారత్, పాకిస్థాన్ మధ్య మరో వన్డే మ్యాచ్ జరుగనుంది.

దాయదుల పోరులో భారత బౌలర్లు ఇరగదీసారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 162 పరుగులకే కుప్పకూల్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. పేస్ ద్వయం భువనేశ్వర్, బుమ్రాలు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు.

దీంతో పాక్ 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజమ్ (47), షోయబ్ మాలిక్ (43) తమ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ 21.2 ఓవర్లలో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బంతితో ప్రమాదకరమైన ఈ జంటను విడదీసి భారత శిబిరంలో ఉత్సాహన్ని నింపాడు. 

తర్వాత మరోసారి భారత బౌలర్లు విజృంభించడంతో పాక్ బ్యాట్స్‌మెన్ వరుసక్రమంలో వికెట్లు కోల్పోయారు.  కేదర్ జాదవ్ వెంటవెంటనే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. చివర్లో ఫహీమ్ అష్రఫ్ (21), మహ్మద్ అమీర్ (18 నాటౌట్) కొద్దిగా పోరాడడంతో పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులు చేయగలిగింది.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 7 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు స్పిన్నర్ కేదార్ జాదవ్ కూడా 23 పరుగులకే 3 వికెట్లు తీశాడు. బుమ్రాకు రెండు, కుల్దీప్‌కు ఒక వికెట్ దక్కింది

Related News