namitha

వాజ్‌పేయి పెళ్లెందుకు చేసుకోలేదు..?

Updated By ManamFri, 08/17/2018 - 11:11

Vajpayeeన్యూఢిల్లీ: చనిపోయేవరకు అవివాహితుడితగానే  ఉండిపోయారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. అయితే వాజ్‌పేయి పెళ్లెందుకు చేసుకోలేదు అనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన వాజ్‌పేయి కాలేజీ రోుల్లో రాజ్ కుమారి అనే అమ్మాయితో కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు.

అయితే కొద్ది రోజులు తరువాత రాజ్ కుమారికి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బీఎన్ కౌల్‌తో వివాహమైంది. పెళ్లి తరువాత కూడా ఈ ఇద్దరు స్నేహితులుగానే ఉండేవారట. కొన్నేళ్ల తరువాత కౌల్ ఓ ప్రమాదంలో చనిపోవడంతో.. రాజ్ కుమారితో పాటు ఆమె కుమార్తె నమితను తన దగ్గరకు వాజ్‌పేయి ఆహ్వానించారు. ఆ తరువాత నమితను దత్తత తీసుకుని పెంచారు. అప్పటి నుంచి 2014లో చనిపోయేవరకు రాజ్‌ కుమారి ఆయనతోనే ఉన్నారు.

కాగా కౌల్ బతికుండగానే వాజ్‌పేయిని పెళ్లాడేందుకు రాజ్ కుమారి విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని కూడా చెబుతుంటారు. అయితే ఓ వివాహితను పెళ్లి చేసుకుంటే జన్ సంఘ్ పార్టీలో కెరీర్ దెబ్బతింటుందని ఓ సీనియర్ ఒకరు హెచ్చరించడంతో ఆయన వెనక్కి తగ్గారని, అందుకే జీవితాంతం అవివాహితుడుగానే ఉండిపోయారని చెబుతుంటారు.లేడీ డాన్ నమిత

Updated By ManamThu, 07/12/2018 - 01:40

imageవిభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడైన టి.రాజేందర్ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘ఇన్నైయ కాదల్ డా’ అనే టైటిల్‌తో రూపొందే ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఛాయాగ్రహణ పర్యవేక్షణ, దర్శకత్వం బాధ్యతలను టి.రాజేందర్ చేపడుతున్నారు.

‘‘ఈ సినిమాలో నమిత లేడీ డాన్‌గా నటించనుంది. ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. అలాగే కొంతమంది కొత్తవారిని కూడా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. పూర్తి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటి ట్రెండ్‌కి తగినట్టుగా సినిమాలో ప్రేమ తప్ప మరో అంశం కనిపించదు. ఇలాంటి సినిమాలో లేడీ డాన్ పాత్ర ప్రాధాన్యం ఏమిటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉషా రాజేందర్, సహాయ నిర్మాతగా ఫరూక్ పిక్చర్స్ టి.ఫరూక్ వ్యవహరిస్తున్నారు.24న న‌మిత పెళ్లి

Updated By ManamFri, 11/10/2017 - 21:45

namitha‘సొంతం’తో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నమిత.. ఆ తర్వాత తెలుగులో ‘జెమిని’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’, ‘నాయ‌కుడు’, ‘ఒక రాజు ఒక రాణి’, 'సింహా' వంటి చిత్రాల్లో త‌న గ్లామ‌ర్‌తో గ్లామ‌ర్ ప్రియుల‌ను మురిపించింది. తెలుగులో సినిమాలు చేస్తూనే.. తమిళ ప‌రిశ్ర‌మ‌లోనూ అవ‌కాశాలు సొంతం చేసుకుంది. అక్క‌డివారి అభిరుచి మేర‌కు బొద్దుగా త‌యార‌యిన‌ నమితకు.. తమిళంలో మంచి క్రేజ్ వ‌చ్చి వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయ్యింది. ఈ హీరోయిన్‌ ఇప్పుడు తమిళ న‌టుడు వీర అలియాస్‌ వీరబాహును ఈ న‌వంబ‌ర్‌ 24న తిరుపతిలో వివాహం చేసుకోనున్నారు. రీసెంట్‌గా కమ‌ల్ హాసన్ బిగ్‌బాస్‌లో కూడా నమిత కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఇక త్వ‌ర‌లో విడుద‌ల కానున్న త‌మిళ హార‌ర్ చిత్రం ‘పొట్టు’లో మంత్రగత్తె పాత్రలో సంద‌డి చేయ‌నుంది న‌మిత‌.

Related News