మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అఖిల్ అక్కినేని..!

Another firing reported at Jamia University

అక్కినేని అఖిల్, పూజ హెగ్డే జంటగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా టైటిల్ ప్రకటించాలనీ చిత్రయూనిట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు టైటిల్ ను రివీల్ చేయనున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాని బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా అఖిల్ కి ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే.