క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం : చంద్ర‌బాబు

క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం : చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ  కష్టకాలంలో ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు' అన్న సిద్ధాంతంపై ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని, దాన్ని మరువకుండా నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నామని తెలిపారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇళ్లలోనే జరుపుకోవాలని, ఇళ్ల పై పార్టీ జెండాలు ఎగుర వేయాలని సూచించారు.
రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సందర్భంలోను, ఉత్తరాఖండ్ వరదల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలిచిన విషయాన్ని ఆయ‌న‌ గుర్తు చేశారు. అదే స్పూర్తితో కరోనా పైనా పార్టీ శ్రేణులు పోరాడాలన్నారు.