నో ఎంట్రీ అంటే నో ఎంట్రీనే.. వారికి తేల్చి చెప్పిన ఏపీ డీజీపీ..! 

ap dgp gowtham sawang sensational decision

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని బ్రేక్ చేసేందుకు ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని త‌మ సొంత గ్రామాల‌కు వెళ్ళేందుకు పలు ప్రాంతాల నుండి విద్యార్ధులు, ఉద్యోగులు బ‌య‌లుదేర‌గా, వారికి ఏపీ పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌డంలేదు. ఈ క్ర‌మంలో ఏపీ బోర్డ‌ర్ వ‌ద్ద వారంద‌రిని పోలీసులు నిలిపివేయ‌గా వారంతా ఆందోళ‌ణ చేప‌ట్టారు. అయితే క‌రోనా వైర‌స్‌ను జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో నిబంధనలకు విరుద్దంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ బోర్డ‌ర్‌ వద్దకు వస్తున్నవారిని ఎట్టి ప‌రిస్థితుల్లో రాష్ట్రంలోకి అనుమతించే ప్ర‌శ‌క్తి లేదని, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ తేల్చి చెప్పారు.  ఎవ‌రికైనా రెండు వారాలపాటు క్వారంటైన్‌ నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలో అడుగు పెట్ట‌డానికి అనుమతి ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు.