క‌రోనా వైర‌స్ : ఇండియాలో లేటెస్ట్ నెంబ‌ర్స్ ఇవే..!

corona virus positive numbers in india

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తుంది. దీంతో మ‌నుషుల ప్రాణాలు లెక్క పెట్ట‌లేనంత‌గా పిట్ట‌లు రాలిపోయిన‌ట్లు రాలిపోతున్నారు. ఈ క్ర‌మంలో క‌రోనా వైర‌స్ భ‌యంతో దాదాపుగా యావ‌త్ ప్ర‌పంచం లాక్‌డౌన్ ప్ర‌కటించాయి. అయినా క‌రోనా వైర‌స్ వ్యాప్తి మాత్రం కొన‌సాగుతూనే ఉంద‌ని, వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌క‌టించిన గ‌ణాంకాలు చెబుతున్నాయి. 

ఇక ఇండియాలో కూడా క‌రోనా దెబ్బ‌కి దేశ వ్యాప్తంగా మూడు వారాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా కేసులు మాత్రం న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం దేశంలో దాదాపు 560 కేసులు న‌మోద‌వ‌గా.. చికిత్స అనంత‌రం 40 మందికి న‌య‌మ‌వ‌గా, ప‌ది మంది చ‌నిపోయారు. మిగిలిన వారు మాత్రం ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. 

ఇక రాష్ట్రాల వారిగా చూసుకుంటే.. కేర‌ళ‌లో 109 కేసులు, మ‌హారాష్ట్ర‌లో 101 కేసులు, క‌ర్నాట‌క‌లో 46 కేసులు, తెలంగాణ‌లో 35 కేసులు, అలాగే ఢిల్లీ, గుజ‌రాత్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కూడా 30కి పైగానే కేస‌లు న‌మోద‌య్యాయ‌ని, తమిళ‌నాడులో 18 కేస‌లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 9 కేసుల న‌మోద‌య్యాయ‌ని  వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ఇక దేశ వ్యాప్తంగా ప‌క‌డ్బందీగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌ధ్యంలో క‌రోనా పై భార‌త్ విజ‌యం సాధిస్తుందో లేదో చూడాలి.