వైసీపీ ఎంపీలు సూప‌ర్ : మాట‌లు కాదు.. అన్ని చేత‌లే..!

ysrcp parlament members donate two months salary

క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం ప్రభుత్వాలు కోట్లు కోట్లు ఖ‌ర్చు చేస్తూ పెద్ద యుద్ధ‌మే చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా వైర‌స్ పై పోరాటంలో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ‌వంతు బాద్య‌త‌గా, ప్ర‌భుత్వాల‌కు విరాళాలు ఇస్తున్న సంగ‌తి తెలిసందే. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా క‌రోనా నివార‌ణ కోసం పలువురు ప్రముఖులు, వ్యాపార‌వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు త‌మ‌వంతుగా ముందుకు వ‌చ్చి విరాళాలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ పార్ల‌మెంట్ స‌భ్యులు రెండు నెల‌ల జీతాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు. ఒక నెల జీతాన్ని ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి, మ‌రో నెల జీతాన్ని ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌హ‌మ్మారి కరోనాను కట్టడి చేసేందుకు తమ వంతు ప్రయత్నంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు వైసీపీ ఎంపీలు తెలిపారు.