క‌రోనాను ఎదుర్కొనే సామ‌ర్ధ్యం భార‌త్‌కు ఉంది..!

who interesting comments on india

యావ‌త్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తుంది క‌రోనా వైర‌స్. క‌రోనా దెబ్బ‌కి అగ్ర రాజ్యాలు సైతం వ‌ణికి పోతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. క‌రోనాను ఎదుర్కొనే సామ‌ర్ధ్యం భార‌త్‌కు ఉందని, ప్ర‌స్తుతం ప్రంచానికి దారి చూపించాల్సింది ఇండియానే అని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ మైఖేల్ ర్యాన్ వ్యాఖ్యానించారు. 

భార‌త్  గతంలోనూ ఇలాంటి మహా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడిందని.. మశూచి, పోలియో సోకిన సమయంలో ఎంతో తెగువ చూపించిన భారత్, ఆ వ్యాదుల నివార‌ణ‌లో విజ‌యం సాధించింద‌ని.. ఇప్పుడు క‌రోనాను కూడా జ‌యిస్తుంద‌ని మైఖేల్ అన్నారు. భార‌త్‌లో జ‌నాభాతో పాటు జ‌న‌సాంద్ర‌త కూడా ఎక్కువేన‌ని, అయినా కూడా క‌రోనాను ధీటుగా ఎదుర్కొనే శ‌క్తి భార‌త్‌కు ఉద‌ని తెలిపారు. ఇక లాక్‌డౌన్‌, కర్ఫ్యూల వ‌ల్ల క‌రోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోలేమ‌ని, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌, సామాజిక దూరం పాటించాల‌ని, మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని మైకేల్ ర్యాన్ స్పష్టం చేశారు.