పోల‌వ‌రం బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాలి 

పోల‌వ‌రం బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాలి 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు జీరో అవర్‌లో పలు అంశాలపై చర్చించాలంటూ చైర్మన్‌కు నోటీసులు ఇచ్చారు. ఈసంద‌ర్భంగా రాజ్య‌స‌భలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధుల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌స్తావించారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్  బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆయ‌న కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల కోసం చూడకుండా ప్రభుత్వం సొంతంగాఖర్చు చేస్తోందన్నారు.కేంద్రం నుంచి రూ. 3,805 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనికి సంబంధించి కాగ్ ఆడిట్ కూడా పూర్తయింద న్నారు. పోలవరంకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్‌ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. నిధుల విడుద‌ల‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ళా సీతారామ‌న్ తెలిపారు. అన్ని అంశాల‌ను ప‌రిశీలించి నిధులు విడుదల చేస్తామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు.