ఏపీలో కరోనా కల్లోలం

CORONA INCREASED IN ANDHRA

ఏపీలో గడిచిన 24 గంటల్లో 72,233 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 9,536 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 5,67,123కు పెరిగింది. తాజాగా మరో 66 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,912కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
మృతిచెందినవారిలో అనంతపురం జిల్లాలో (7), నెల్లూరులో(7), ప్రకాశంలో(7), కడపలో(6), విశాఖపట్నంలో(6), చిత్తూరులో(5), తూర్పు గోదావరిలో(5), కృష్ణాలో(5), కర్నూలులో(5), గుంటూరులో(4), విజయనగరంలో(4), పశ్చిమ గోదావరిలో(3), శ్రీకాకుళంలో(2) చొప్పున మృతిచెందారు.
మరోవైపు గడచిన 24 గంటల్లో 10,131 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,67,139కి చేరింది. కాగా, ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 45,99,826 పరీక్షలు పూర్తవగా.. ప్రస్తుతం 95,072 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.