పార్లమెంట్‌ సమావేశాలు రేపట్నుంచి : ప‌్రారంభ‌మైన బీఏసీ 

పార్లమెంట్‌ సమావేశాలు రేపట్నుంచి : ప‌్రారంభ‌మైన బీఏసీ 

వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి రియల్‌ టైమ్‌లో ఉభయసభలు సమావేశం కానున్నాయి. 15 నుంచి ఉదయం 11 గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 2గంటల నుంచి లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమావేశాల నిర్వహణపై పలుమార్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 
సభలకు హాజరయ్యే ప్రతి సభ్యుడు విధిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. నెగిటివ్‌ వచ్చిన వారికే పార్లమెంట్‌ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తర్వాత తొలిసారిగా సమావేశాలు జరుగుతున్నందున పార్లమెంట్‌ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  రాజ్య‌స‌భ స‌భ్యుల్లో అధిక వ‌య‌స్సువారే ఉండ‌టంతో అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. 72 గంట‌ల ముందుగానే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని స‌భ్యుల‌కు సూచించారు. సభ్యులందరికీ ముందు జాగ్రత్తగా కిట్లు సరఫరా చేశారు. సమావేశాల నేపథ్యంలో ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో బీఏసీ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి అన్ని పార్టీల ప్లోర్ లీడ‌ర్లు హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట్ స‌మావేశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.