నటుడు చాడ్విక్ బోస్‌మాన్‌ కన్నుమూత

నటుడు చాడ్విక్ బోస్‌మాన్‌ కన్నుమూత

"బ్లాక్ పాంథర్" సినిమాతో ప్రపంచం వ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ హీరో చాడ్విక్ బోస్‌మాన్‌ (43) కన్నుమూశాడు. గత నాలుగేళ్ల నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన అమెరికాలోని ఏంజెల్స్ లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. బ్లాక్ ఫాంథర్, ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్, ఎండ్ గేమ్ సహా పలు సినిమాల్లో చాడ్విక్ నటించాడు. ఈ సినిమాల్లో బోస్‌మాన్‌ పాత్ర అమోఘమని ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ నటుడు 2016 నుండి స్టేజ్ త్రీ ప్రేగు క్యాన్సర్‌ తో బాధపడుతున్నాడు. పెద్ద ప్రేగు క్యాన్సర్‌ తో పోరాడుతూ మరణించాడని ఆయన కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.  మొన్న బాలీవుడ్ లో జరిగిన మరణాలను మరవకముందే ఇప్పుడు హాలీవుడ్ స్టార్ హీరో చాడ్విక్ బోస్‌మాన్ హఠాత్తుగా మృతి చెందడం సినీ ప్రపంచాన్ని మరింత షాక్ కి గురి చేస్తోంది.