క‌రోనా కేర్ సెంట‌ర్ లో అగ్ని ప్రమాదంపై జ‌గ‌న్ ఆరా

క‌రోనా కేర్ సెంట‌ర్ లో అగ్ని ప్రమాదంపై జ‌గ‌న్ ఆరా

విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చోటుచేసు కున్న భారీ అగ్నిప్రమాదంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదం గురించి అధికారులు సీఎంకు వివరించారు. తక్షణ చర్యలు చేపట్టాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.