రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెంద‌గా, మరో ముగ్గురు గాయ‌ప‌డిన విషాద ఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారిపై ఇవాళ‌ ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా ఉన్న వాహనాన్ని స్కార్పియో కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులను ఖరగ్‌పూర్‌ వాసులుగా గుర్తించారు. శ‌నివారం నాడు విశాఖ షిప్‌యార్డ్‌ ప్రమాదంలో మృతిచెందిన కుమారుడి కోసం వీరు వస్తుండగా ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.