తెలంగాణ‌లో రెండ్రోజుల పాటు వ‌ర్షాలు 

తెలంగాణ‌లో రెండ్రోజుల పాటు వ‌ర్షాలు 

తెలంగాణ‌ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో రెండ్రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని అన్నారు. దీంతో పలుచోట్ల శని,ఆది వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ నెల 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరఠ్వాడా నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని అన్నారు. కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల వలయం ఏర్పడిందని ఆయన వివరించారు. అయితే రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో కురిసిన సంగ‌తి విదిత‌మే.