మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి తప్పుకున్న బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి తప్పుకున్న బిల్ గేట్స్

 మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌కు రాజీనామా చేశారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి బిల్‌గేట్స్‌ తప్పుకున్నారు. ఆయన సాంకేతిక సలహాదారుడిగా కొనసాగనున్నారు. తన సమయాన్ని గ్లోబల్ హెల్త్, విద్య వంటి సామాజిక సేవలకు వినియోగించే ఉద్దేశంతో ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. సామాజిక కార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయిస్తానని బిల్ గేట్స్ చెప్పారు.

బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు. 1975లో మైక్రోసాఫ్ట్ సంస్థను బిల్ గేట్స్ స్థాపించారు. 2000 సంవత్సరం వరకు కంపెనీ సీఈవోగా కొనసాగారు. 2014లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బిల్ గేట్స్ తప్పుకోవడంతో మైక్రో సాఫ్ట్ బోర్డులో 12 మంది ఉంటారు. బిల్ గేట్స్ కలిపి పనిచేయడం గొప్ప గౌరవమని సత్యనాదెళ్ల తెలిపారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపారు.