తెలంగాణ‌లో కొత్త‌గా 1891 క‌రోనా కేసులు 

తెలంగాణ‌లో కొత్త‌గా 1891 క‌రోనా కేసులు 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 1891 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 10 కరోనా మరణాలు సంభ వించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 540 కి చేరింది.  జీహెచ్ఎంసి పరిధిలో 517, కరీంనగర్ లో 93, మేడ్చల్ లో 146, నిజామాబాద్ లో 131, రంగారెడ్డి 181, సంగారెడ్డిలో 111, వరంగల్ అర్బన్ లో 138 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,677కి చేరింది. ఇందులో 47590 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18547 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. హైదరాబాద్ తో పాటుగా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.