చెరశాల కాదది.. కార్యశాల

Updated By ManamFri, 07/13/2018 - 02:07
Cherrapalli prison
  • పాఠశాలలూ.. పని వసతులూ.. ఖైదీల ఉత్పత్తులకు క్రేజ్...

  • ఘనంగా పెరిగిన ఆదాయం.. బ్యాంకు అకౌంట్లూ ఉన్నయ్

  • ఖైదీల క్షమాభిక్షపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తాం

  •  సందర్శించిన టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ 

Cherrapalli prisonహైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలును పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు గురువారం సందర్శించారు. అనంతరం..అక్కడి జైలులో ఉన్న సౌకర్యాలు, పరిస్థితులపై వారు మీడియాతో మా ట్లాడారు. చర్లపల్లి జైలు.. జైలులా లేదని..ఒక మ్యూజియంలా ఉందని పాతూరి కోనియాడారు. ఇక్కడ ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు బహుశా దేశంలోనే మరెక్కడా ఉండక పోవచ్చన్నారు. ఖైదీలకు కూడా ప్రత్యేక బ్యాంకు అక్కౌంట్లు ఉన్నాయని మండలి విప్ చెప్పారు. ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులతో జైళ్ల శాఖకు గతంతో పోలిస్తే ఆదాయం ఘనంగా పెరిగిందన్నారు. ఎక్కడా లేనంతగా చర్లపల్లి జైలులో ఖైదీల ఆరోగ్యంపై అదొక మ్యూజియం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన స్పష్టంచేశారు. గతంలో వివిధ అనారోగ్య కారణాలతో సాలీనా ఎంతో మంది ఖైదీలు మరణిస్తే...ఇప్పుడది 5 మందికి తగ్గిందన్నారు. నిరక్ష్యరాసులైన ఖైదీలకు అక్షరజ్ఞానం నేర్పేందుకు ఇక్కడ అన్ని హంగులతో పాఠశాల నడుస్తుండటం అత్యంత సంతోషాన్నిచ్చిందన్నారు. తమకు అందుతున్న సౌకర్యాలపై ఖైదీలు సంతృప్తిని వ్యక్తం చేశారని పాతూరి సుధాకర్ రెడ్డి చెప్పారు. జైలును సందర్శించిన వారిలో ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి,చావుకూర మల్లారెడ్డి, కోండా విశ్వేశ్వర్ రెడ్డి, బండా ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, బీబీ పాటిల్, మేయర్ బోంతు రామ్మోహ న్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, రాములు నాయక్, కాటేపల్లి జనార్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఇతర టీఆర్‌ఎస్ నేతలు తదితరులు ఉన్నారు. అయితే, ప్రభుత్వం తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని పలువురు ఖైదీలు కోరుకుంటున్నారని వారు తెలిపారు. 2016లో మాదిరిగా మరోసారీ ప్రభుత్వం తమ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవాలని తమకు విజ్ఞప్తి చేశారని ,వారి విజ్లప్తులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని బృందంలో కీలక నేత, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఈ ప్రజాప్రతినిధులు బృందం నాయకుడు  కె. కేశవరావు హామీ ఇచ్చారు. తెలిసీతెలియక తప్పిదాలు, వేసిన తప్పటడుగులు, అనాలోచిత నిర్ణయాలు, క్షణికావేశంలో చేసే తప్పిదాల మూలంగా నిండు జీవితం బలి కావద్దన్న సదుద్దేశంలో గతంలో క్షమాభిక్ష పెట్టినట్లు తెలిపారు. ఈసారి కూడా ఖైదీలకు క్షమాభిక్షచ్చే విషయంలో చొరవ చూపుతాననికే వెల్లడించారు. 

English Title
Turnaround .. office
Related News