కుటుంబంతో ఇండియాకు వస్తున్న నిక్ జోనస్

Updated By ManamThu, 08/16/2018 - 12:08
Priyanka, Nick

Priyanka, Nickఅమెరికన్ సింగర్ నిక్ జోనస్ తన కుటంబంతో సహా భారత్‌కు రానున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ నిశ్చితార్థం జరగగా.. అతడి కుటుంబానికి ప్రియాంక ఫ్యామిలీ ట్రీట్ ఇవ్వనుంది. ఈ క్రమంలో నిక్ జోనస్ ఫ్యామిలీ సభ్యులు ఈ వారాంతంలో భారత్‌కు రానున్నారు. ఇక నిక్, ప్రియాంక ఇరు కుటుంబాల ఫ్యామిలీ సభ్యులు కూడా కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు వెల్లడించారు.

కాగా పెళ్లికి ముందు వధూవధుల కుటుంబాలు కలుసుకునే సంప్రదాయం ప్రియాంక కుటుంబసభ్యులు ఆచరిస్తుండగా.. అందులో భాగంగానే నిక్ జోనస్ ఫ్యామిలీ భారత్‌కు రాబోతుంది. అంతేకాదు సంప్రదాయాలకు విలువనిచ్చే ప్రియాంక, తన వివాహాన్ని కూడా భారత సంప్రదాయానికి అనుగుణంగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో ఇరువురి సన్నిహితులు హాజరుకానున్నట్లు సమాచారం.

English Title
Priyanka Chopra and Nick Jonas' Families to Meet in India for Engagement Party
Related News