కృత్రిమ మేధతో కొత్తపుంతలు

Updated By ManamFri, 05/25/2018 - 01:22
image

image‘మేధస్సు’ లేదా ‘తెలివి తేటలు’ అనేవి ఒక వర్గానికో, జాతికో, ప్రదే శానికో, ప్రాంతానికో చెం దినవి కావు. తెలివితేటలు అంటే మనం సంపా దించిన జ్ఞానాన్ని సరైన సమయంలో, సరైన సంద ర్భంలో ఆచరణాత్మకంగా వినియోగించటం. అభ్యా సం, అనుభవం, విచక్షణ అనే మూడు గుణాల ద్వా రా ఎవ్వరైనా తెలివితేటలను అభివృద్ధి చేసుకోవచ్చు. నేడు మనిషి తన తెలివితేటలను అభివృద్ధి చేసుకో వటమే కాక, యంత్రాలకు కూడా ‘కృత్రిమ మేధ’ను కల్పించటంలో కృతార్దుడయ్యాడు. మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ వంటి యంత్రాల దగ్గ ర నుంచి కార్ల వరకు ప్రతిదానికి ‘కృత్రిమ మేధ స్సు’ను జోడించటంలో సాంకేతిక నిపుణులు విజ యం సాధించారు. కాని అదే సమయంలో ‘కృత్రిమ మేధ’ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోతారని, తద్వా రా దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని ఊహించ లేకపోయారు. 

కేవలం దేశ ఆర్థిక వ్యవస్థపైనే కాక, వ్యవసా యం, ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లో సైతం ‘కృత్రిమ మేధ’ ప్రభావం గణనీయంగా వుండబో తోంది. ఈ ప్రభావం ఎంతమేర వుంటుందో అంచనా వేయటానికి ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కామకోటి ఆధ్వర్యంలో ‘టాస్క్‌ఫోర్స్’ను నియమించటం జరిగిం ది. ప్రతిరంగంలో కృత్రిమ మేధను చొప్పించటం ద్వా రా (ఆటోమేషన్) యంత్రాలు తమంతట తామే వేగంగా పనిచేయటం మొదలుపెట్టాయి. ఇటువంటి వాతావరణంలో మానవ ప్రమేయం అవసరం లేకుం డా పోతుండటంలో లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. పెరుగుతున్న జనాభాకు అను గుణంగా వారికి ఉపాధి కల్పించటమే ప్రభుత్వానికి ఒక సవాలుగా మారితే, ఇప్పుడు ‘కృత్రిమ మేధ’ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి కల్పించటం మరో సమస్య ప్రభుత్వానికి సవాలు విసురుతోంది. 

సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించిన ప్రతిసారి ఇటు పరిణామాలు జరుగుతూనే వున్నాయి. 500 సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ రాణి ఎలిజిబెత్-1 దగ్గరకు నేత యంత్రాన్ని కనిపెట్టిన వ్యక్తి వెళ్లి, ఆ యంత్రంపై హక్కుల కోసం అర్థించాడు. ఆ యంత్రం కాని వెలుగులోకి వస్తే నేత పనిపై ఆధారపడుతున్న ఎంతోమంది చేతి మగ్గాల వారికి పనిలేకుండా పోతుందని, ఆ అభ్యర్థనను ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కానీ అభివృద్ధిని ఎవ్వ రూ ఆపలేరన్నట్లు, నూలుమిల్లుల వారు ఈ యంత్రా లను వాడటం మొదలుపెట్టారు. తద్వారా నూలు ధరలు గణనీయంగా తగ్గటంతో దాని వినియోగం పెరిగింది. 19వ శతాబ్దం చివరకు ధరలు తగ్గటం, డిమాండ్ పెరగటంతో నాలుగింతల మంది శ్రామికు లకు ఈ రంగంలో ఉపాధి దొరికింది. రెండు శతా బ్దాల క్రితం కేవలం రెండు జతల బట్టలు కొనుగోలు చేసే సగటు మనిషి అరడజను జతల బట్టలు కొనే స్థాయికి ఎదగడం, వినియోగం పెరిగి, దానికి అనుగు ణంగా ఉత్పత్తికి కొత్తనూలు మిల్లులు అవతరించ టంతో ఎంతోమందికి ఎన్నోరకాల ఉపాధి ఏర్పడింద నేది చరిత్ర చెప్తున్న వాస్తవం. 

ఆవిరి యంత్రం కనుగొన్నప్పుడు, అంతర్గత దహన యంత్రం కనుగొన్నప్పుడు, అచ్చు యంత్రం ప్రవేశపెట్టినప్పుడు, కంప్యూటర్ కనుగొన్నప్పుడూ ఇలా ప్రతిసారీ విజ్ఞాన రంగంలో పెనుమార్పులకు దారితీసిన ప్రతిసారీ ఎంతో కొంత సామాజిక, అర్థిక అంతరాలు ఏర్పడటం, క్రమేణా వాటి ఫలాలు అంద టం మొదలవ్వగానే ఇవి సమసిపోవటం పరిపాటి గానే వస్తోంది. ఇప్పుడు కూడా అదే జరగబోతోం దనేది సత్యం. చెట్టు ఎదిగి కాయలు కాసేంత వరకూ ఓపిక పట్టాలి. అప్పటివరకూ తాత్కాలికంగా ఏర్పడే అంతరాలను భూతద్దంలో నుంచి చూడవలసిన అవసరం లేదు. 

ఉదాహరణకు, చట్టపరమైన పరిశోధనల్లో ‘కృత్రి మ మేధ’ను చొప్పించటం ద్వారా సంవత్సరాల తర బడి తీర్పుల కోసం ముద్దాయిలు వేచి వుండనవసరం లేదు. ఒకకేసులో తీర్పునివ్వటానికి, అదే తరహా కేసు ల్లో ఎటువంటి తీర్పులు వెలువడ్డాయి, ఏ సెక్షన్ల ప్రకా రం ఆ తీర్పులివ్వటం జరిగింది, వాటిలో ఏమన్నా లొసుగులున్నాయా అని ఇకముందు వకీళ్ళు తమ బుర్రలు బద్దలు కొట్టుకోనవసరం లేదు. (మేషిన్ లర్నింగ్) యంత్ర అభ్యాసం ద్వారా ‘కృత్రిమంగా ఈ రంగంలో మేధస్సును జోడించటం వలన సులభం గా, నిస్పక్షపాతంగా త్వరితగతిన తీర్పులు వెలువరిం చవచ్చు. తద్వారా న్యాయసేవలు సామాన్యులకు త క్కువ ఖర్చుకు లభ్యమవ్వటం వల్ల ఎక్కువమంది న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం వుంది. ఈ పరిణామం వల్ల ఎక్కువ మంది వకీళ్ళకు, న్యాయ మూర్తులకు పని దొరుకుతుంది. 

ఇదే తరహాలో వైద్యరంగంలో ‘కృత్రిమ మేధ స్సు’ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేన్సర్, బ్రెయిన్‌స్ట్రోక్, హృద్రోగం వంటి జబ్బులను ఖచ్చితం గా అంచనా వెయ్యటంలో దీని పాత్ర ఎంతో ప్రాము ఖ్యాన్ని సంతరించుకుంది. వ్యాధి నిర్ధారణ ప్రక్రియ సులభమవ్వటంతో వైద్యులకు తక్కువ సమయంలో ఎక్కువమంది రోగులకు వైద్యసేవలు అందించ గలుగుతున్నారు. ఇటువంటి సాంకేతిక యంత్రాలు అందుబాటులోకి రావటం వల్ల ఎంతోమందికి పరో క్షంగా ఉపాధి కూడా దొరుకుతోంది. 
మన చలనచిత్రాల్లో చూపించినట్లు ‘కృత్రిమ మేధ’తో కూడిన కంప్యూటర్లు, రోబోట్లు అన్ని రంగాల్లో అన్ని పనులు చేస్తాయనుకోవటం కేవలం అవగాహనా లోపం మాత్రమే. కంప్యూటర్లు కృత్రిమ మేధతో మనం చేసే రోజువారి కార్యక్రమాలు మరిం త ఖచ్చితంగా, త్వరితంగా చేయగలవు. అంతేకాని మనుషుల్లా భావోద్వేగాలను అర్థం చేసుకోలేవు. సృజ నాత్మకంగా ఆలోచించనూలేవు. కాబట్టి రానున్న రో జుల్లో ఉపాధి దొరకాలంటే విభిన్న రంగాలలో సృజ నాత్మకంగా, నిర్మాణాత్మకంగా, వియుక్త, వ్యవస్థాపక ఆలోచనలతో సంక్లిష్టమైన సమాచార వ్యవస్థలో మానవ సంబంధాలను, సంస్కృతి, సంప్రదాయాల అంతరాలను అర్థం చేసుకుంటూ సామాజిక భావో ద్వేగాలను అర్థం చేసుకోగల నైపుణ్యాలను అందిపు చ్చుకోవాలి. 

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ‘అనివార్యమైన చావుపుట్టుకల గురించి విచారించటం’ తగదన్నట్లు, వివిధ రంగాల్లో ‘కృత్రిమ మేధ’ ప్రమేయం అని వార్యం. దానివల్ల కొంతమేర ఉద్యోగిత శాతం కూడా తగ్గవచ్చు. ఈ పరిణామాలనధిగమించటానికి ఇతర రంగాల్లోని ఉపాధి అవకాశాలను గుర్తించి వాటికి తగ్గట్టు యువతకు శిక్షణ నివ్వాలి. నిజానికి మనం నేర్పు తున్న పాఠ్యాంశాల వల్లే యువతకు సరైన ఉపాధి దొరకకుండా పోతోంది. మన సాంకేతిక విద్యా బోధన లో మార్పులు నత్తనడకన నడుస్తుంటే, ఈ రంగంలో వస్తున్న మార్పులు మాత్రం ప్రజల జీవితాల్లో వేగం గా మార్పు తెస్తున్నాయి. అంటే మనం చెప్పే చదు వుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఉదాహ రణకు అంతర్జాలం ఎలా వినియోగించాలో డిగ్రీస్థాయి లో పాఠ్యాంశాన్ని నేర్పబోతే ఆపాటికే విద్యార్థులు దానిపై పూర్తిగా పట్టు సాధిస్తున్నారు. 

కంప్యూటర్ రంగంలో గత పది సంవత్సరాలలో జరిగినన్ని విప్లవాత్మకమైన మార్పులు ఎన్నడూ జరగ లేదు. ఐ.ఓ.టి., బిగ్‌డాటా, క్లౌడ్ కంప్యూటింగ్, మొబై ల్ కంప్యూటింగ్ వంటి ఎన్నో నూతన సాంకేతిక అం శాలు తెరమీదకొచ్చాయి. ఇటువంటి సాంకేతిక పరి ణామాలన్నీ మన జీవన ప్రమాణాలు మరింత మెరు గవటానికి దోహదపడేవేకాని వాటివల్ల ఏనాడు మాన వాళి మనుగడకు ప్రమాదం ఏర్పడలేదు. కాకపోతే ఒక దశ నుంచి మరో దశకు, ఒక సాంకేతిక రంగం నుంచి మరో రంగానికి మారే క్రమంలో కొద్దిపాటి ఘర్షణ తప్పదు. అంతెందుకు ప్రజలు గాలి, నీరు లేకుండా ఎలా బతకలేరో నేడు విద్యుత్తు, అంతర్జాల సదుపాయాలు లేకుండా ఒక్క క్షణం కూడా వుండలేని స్థితి ఏర్పడింది. ఇక ప్రతి ఒక్కరి చేతిలో ‘స్మార్ట్ ఫోన్లు’ సరేసరి. స్మార్ట్ ఫోన్లు వచ్చి ‘రేడియో’, ‘టేప్‌రికార్డర్’, ‘కెమెరా’, ‘కాలిక్యులేటర్’ ఎన్నో సాంకే తిక పరికరాలను మింగేసింది. వాటి తయారీ, రిపేర్లు వంటివాటి మీద ఆధారపడేవారు జీవనోపాధి కోల్పో యారు. వారందరూ త్వరితగతిన స్మార్ట్ ఫోన్ల రిపేర్లు నేర్చుకుని ఉపాధి పొందుతున్నారు. 

గార్డనర్ కంపెనీ అంచనాల ప్రకారం ‘కృత్రిమ మేధ’ వల్ల 2019 నాటికి 1.8 మిలియన్ల మంది ఉపాధి కోల్పోనుండగా, 2020 నాటికి అంతకంటే ఎక్కువమందికి ఈ రంగం ఉపాధి కల్పించబోతోంది. ఇప్పటివరకు సంప్రదాయ మొబైల్ యాప్‌లను వృద్ధి చేస్తున్న సంస్థలో 50% చాట్‌బోట్‌లను రూపొందించే దిశగా తమ కార్యాచరణను మార్చుకున్నాయి. రాను న్న కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాలే ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటాయి. ఈ ప్రక్రియలో వాటి నుంచి వెలువడే సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవటానికి ‘కృత్రిమ మేధ’ పాత్ర ఎంతో వుంది.

ఇప్పటికే సాంకేతిక దిగ్గజాలైన గూగుల్ (20 బి. డాలర్లు), బైదు (30 బి.డాలర్లు) కంపెనీలు కృత్రిమ మేధో రంగంలో పరిశోధనలపై పెద్ద ఎత్తున వెచ్చి స్తున్నాయి. ఇప్పటిదాకా ‘కృత్రిమ మేధ’ను ప్రొగ్రా మింగ్ ద్వారా మానవులే వృద్ధి చేస్తున్నారు. కాని ఇక ముందు కంప్యూటర్లే ‘మెషిన్ లర్నింగ్’ ద్వారా తమం తటతామే ‘డీప్ లెర్నింగ్’ ద్వారా నేర్చుకోవటం మొద లుపెట్టి, మానవప్రమేయం లేకుండా ఏ సమస్యనైనా విశ్లేషించే సామర్థ్యాన్ని అందుకోనున్నాయి. దీనికి ఉదాహరణే ఇటీవల ఫేస్‌బుక్ తాము మొదలుపెట్టిన ‘కృత్రిమ మేధ’పై పరిశోధనలను తాత్కాలికంగా నిలిపివేయటం. కృత్రిమ మేధ పరిశోధనల్లో భాగంగా ఫేస్‌బుక్ సంస్థ ఏర్పాటు చేసిన చాట్‌బోటులు తమకు నిర్దేశించిన భాషలోని పదాలతో ముచ్చటించకుండా, తమ సొంతభాషను రూపొందించుకుని శాస్త్రవేత్తల సూచనలను పట్టించుకోకపోవటమే దీనివెనకున్న అస లు కారణం. 

ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో వచ్చే మా ర్పులకు అతిగా స్పందించి ఏదో జరిగిపోతుందని భయపడటం మనకు అలవాటుగా మారింది తప్ప, భవిష్యత్తులో ఈ మార్పుల వల్ల మానవాళికి ఎంత ఉ పయోగమో అంచనావెయ్యలేకపోవటం మన అవివేకా నికి నిదర్శనం. ఏ ఆవిష్కరణలైనా, నూతన పరిశోధ నలైన నిజమయ్యేంతవరకు ఒక కలగానే వుంటాయి. ఆ కలలు నిజమయ్యి వాటి ఫలితాలు అందించే ఫలాలు ఎప్పుడూ తియ్యగానే వుంటాయి. అప్పటి దాకా అందరం ఓపిక పట్టాలి. 

- ఈదర శ్రీనివాస్‌రెడ్డి
ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, 
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
 7893111985

English Title
Newfold with artificial intelligence
Related News