ఆర్థికవేత్తల సలహాలకు ప్రభుత్వం పెడచెవి! 

Updated By ManamFri, 07/13/2018 - 01:18
image

imageవ్యవసాయ రుణాలు. వీటిని రద్దుచేయడం ఆర్థికవేత్తలెవరికీ ఇష్టం లేకపోయినా మానవతా భావంతో ఈ అంశాన్ని ఆ ఏడాది ఎవరూ ప్రస్తావించ లేదు. మరీ ముఖ్యంగా రైతుల రుణమాఫీ కేంద్రంలోని ప్రభుత్వానికి ఇష్టంలేకపోయినా ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి తన వ్యతిరేకతను బయటపెట్టేందుకు సుముఖంగా లేదనేది సుస్పష్టం. దేశంలో దాదాపు 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు కాబట్టి వ్యవసాయ రుణాల మాఫీ అంశాన్ని వ్యతిరేకించేందుకు సాహసించడం లేదు. స్వల్ప మొత్తాల రుణగ్రహీతలు. తీసుకున్న అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు తెచ్చే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే చిన్నకారు రైతు లు ఈ కేటగిరీలోకి వస్తారు. రుణంపొంది బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీలలాగా వీరు పారిపోలేరు. 

తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలో దీర్ఘకాలిక పరిష్కారాలు సాధ్యం కాకపోతే సంక్షోభాన్ని కొంతవేురకు పరిష్కరిచేందుకు మార్గాలను అన్వేషిస్తాం. తప్పుడు రుణాల (నిరర్థక ఆస్తులు - ఎన్‌పీఏలు) విషయంలో బ్యాంకింగ్ విధానం అతలాకుతలం అవుతున్న విషయం విదితమే. ఈ పరిస్థితిని చక్కదిద్దేం దుకు ఇద్దరు ప్రముఖ ఆర్థికవేత్తలు అవెురికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన తరువాత ఇక్కడి రాజకీయ ఒత్తిడులను తట్టుకోలేకపోయారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాల మధ్య ఏర్పడిన రాజకీయ వైరుధ్యం వారి చేతుల్ని కట్టేసింది. ప్రభుత్వాల రాజకీయ దృక్పథాల నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను పరిష్కరించేందుకు వారు తీసుకున్న చర్యలు నిష్ప్రయోజనంగా మారాయి. బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న ఎన్‌పీఏలు వీధుల్లో చెత్త పేరుకుపోయినట్టుగా పేరుకుపోయినప్పటికీ ప్రభుత్వాలు చేష్టలుడిగి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించేందుకు విముఖంగా ఉ న్న పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలను ‘సహాయ నిరాకరణ ఎగవేతదారు’లని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభివర్ణించారు. ఎన్‌పీఏల గురించి అంతకంటే మరింత కఠినపదాల తో కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖలో చీఫ్ అడ్వయిజర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడారు. పదవీ కా లం ముగియకముందే ఆయన చీఫ్ అడ్వయిజర్ పదవికి రాజీనామా చేసి అవెురికా వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఎన్‌పీఏ సమస్యను పరిష్కరించడంలో సంస్కరణ విధానాలు చేపట్టకుండా ప్రభుత్వానికి ‘నిరుద్యోగిత పెట్టుబడీదారి వి ధానం’ ప్రతిబంధకంగా ఉందని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్ని మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎవరూ తగిన ధైర్యం చేయడంలేదు. 

తీసుకున్న చర్యలన్నీ నిష్ప్రయోజనమయ్యాయనేది తిరుగలేని నిజం. ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం రాలేదు. సుబ్రమణియం సూచించినట్టుగా ‘న్యాయపరమైన పరిష్కారం’ మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఎన్‌పీఏల వల్ల బ్యాంకులు ప ది లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి. న్యాయపరమైన పరిష్కారమంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో తేలాల్సిన అంశం కావడంతో సుదీర్ఘకాలం పట్టవచ్చుననేది ఆలోచించాల్సిన విషయం. అధికారులు హియరింగ్‌లు, చర్చోపచర్చలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి త్వ రగా తేలే అవకాశం ఏ మాత్రం ఉండదు. ఇదే అంశాన్ని ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో జరిగిన మోసం రుజువుచేస్తోంది. బ్యాంకును ఏమార్చేందుకు అధికారులతో కు మ్మక్కై డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ దాదాపు పదివేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. ఎన్‌పీఏ సమస్యకు మనం ప్రస్తుతం అనుసరిస్తున్న ‘ప్రాజెక్ట్ శాశక్త్’ విధానం కేవలం ఫ్యాన్సీ బ్రాండ్ పేరుగా నిలిచిపోతోంది. ఇది అటు రాజన్ సూచించిన పరిష్కారమార్గాన్నిగానీ, ఇటు సుబ్రమణియన్ చెప్పిన పరిష్కారమార్గాన్ని గానీ పట్టించుకోవడం లేదు. కేవలం మాటలే కానీ చే తలు కనిపించడం లేదు. ఎన్‌డీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానం లో ఆయన ప్రమేయం లేకపోయినప్పటికీ రాజన్‌ను ఇప్పటికీ ఎందుకు ప్రశంసిస్తున్నారో ఎవరికీ అర్థంకాని విషయం. 

ఆర్థికరంగాన్ని అతలాకుతలం చేస్తున్న రెండో అంశం- వ్య వసాయ రుణాలు. వీటిని రద్దుచేయడం ఆర్థికవేత్తలెవరికీ ఇష్టం లేకపోయినా మానవతా భావంతో ఈ అంశాన్ని ఆ ఏడాది ఎవ రూ ప్రస్తావించ లేదు. మరీ ముఖ్యంగా రైతుల రుణమాఫీ కేం ద్రంలోని ప్రభుత్వానికి ఇష్టంలేకపోయినా ఇది ఎన్నికల సంవత్స రం కాబట్టి తన వ్యతిరేకతను బయటపెట్టేందుకు సుముఖంగా లేదనేది సుస్పష్టం. దేశంలో దాదాపు 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు కాబట్టి వ్యవసాయ రుణాల మాఫీ అంశాన్ని వ్యతిరేకించేందుకు సాహసించడం లేదు. ఇక మూడోది - స్వల్ప మొత్తాల రుణగ్రహీతలు. తీసుకున్న అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు తెచ్చే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే చిన్నకారు రైతులు ఈ కేటగిరీలోకి వస్తారు. రుణంపొంది బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీలలాగా వీరు పారిపోలేరు. అసలలాంటి ఆలోచనే వీరికి రాదు. అందుకే సుబ్రమణియం ముందుచూపు తో న్యాయపరమైన పరిష్కారం అని సూచించారు. విజయ్ మాల్యాకు సంబంధించిన చెడు రుణాల గురించి లోతుగా ‘ఫస్ట్ పోస్టు’ పరిశీలించినపుడు, నిస్సహాయ స్థితిలో ఉన్న రైతును, మరో సెక్యూరిటీ గారును కింగ్‌ఫిషర్ డైరెక్టర్‌గా భావించి ఆస్తులను స్తంభింపచేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఉత్సా హం చూపారు. ఇదంతా చూస్తుంటే ఎవరూ పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలను ముట్టుకోకుండా పెద్ద ఇనుపతెరలు అడ్డమున్నాయని స్పష్టమవుతోంది. ఈ అంశంలో త్వరగా పరిష్కరించే యోచనగానీ, అత్యవసరంగానీ ఎవరిలోనూ కనిపిచండం లేదు.
మాధవన్ నారాయణన్, సీనియర్ జర్నలిస్టు
(ఫస్ట్‌పోస్టు సౌజన్యం)

Tags
English Title
Government to push for economists advice
Related News