మోత్కుపల్లితో విజయసాయిరెడ్డి భేటీ

Updated By ManamThu, 06/14/2018 - 18:48
YSRCP MP Vijaya Sai Reddy, Motkupally Narasimhulu, YSRCP
  • మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ సంఘీభావం

YSRCP MP Vijaya Sai Reddy, Motkupally Narasimhulu, YSRCPహైదరాబాద్‌: టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుతో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పినట్టు సమాచారం. ఈ భేటీలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై కూడా వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. ఇటీవల మహానాడు సందర్భంగా మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాను టీడీపీకే తన జీవితాన్ని అంకితం చేశానని అప్పట్లో ఆయన కంటతడి పెట్టుకున్నారు. బుధవారం యాదాద్రి జిల్లాలోని ఆలేరులో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లితో విజయసాయిరెడ్డి భేటీ చర్చనీయాంశంగా మారింది. 

English Title
YSRCP MP Vijaya Sai Reddy meets Motkupally Narasimhulu
Related News