ఇచ్ఛాపురంలో ముగిసిన జగన్ పాదయాత్ర

YS jagan mohan reddy  praja sankalpa yatra  end on Ichapuram

శ్రీకాకుళం : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఏడాది కాలంగా చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగిసింది. 2017 నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

అక్కడ నుంచి అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేస్తూ... శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో యాత్రను ముగించారు. ఈ సందర్భంగా తన కోసం అడుగులు వేస్తూ తరలి వచ్చిన అందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాదయాత్రలో  ప్రజల గుండెచప్పుడు విన్నానని అన్నారు. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నడవగలిగానంటే అందుకు ప్రజలే కారణమని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రజాసంకల్పయాత్రకు గుర్తుగా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు