గొలుసు దొంగలించబోయి.. భలే బుక్కయ్యాడు!

Rob Jewellery Store, Thailand, Video Viral, Rob Jewellery Store

థాయిలాండ్‌: థాయిలాండ్‌లో ఓ దొంగ కస్టమర్‌లా నటిస్తూ జ్యుయలరీ షాపులో గొలుసు దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు. షాపు యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో చేసేది ఏమిలేక 27ఏళ్ల యువకుడు తాను దొంగలించిన గొలుసును తిరిగి యజమానికి ఇచ్చేశాడు. ఈ ఘటన థాయిలాండ్‌లోని చాన్‌బరి జ్యుయెలరీ షాపులో గతనెల 30న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది. వివరాల్లోకి వెళితే.. 27ఏళ్ల సుపాచాయ్ పంతంగ్ అనే యువకుడు కస్టమర్‌లా నటిస్తూ జ్యుయలరీ షాపులోకి వెళ్లాడు. 

బంగారం గొలుసు చూపించమని యజమానిని అడిగాడు. గొలుసు చూపించగా మెడలో వేసుకొని చూస్తున్నట్టుగా కాసేపు నటించిన పంతంగ్.. మెల్లగా గొలుసుతో అక్కడి నుంచి జారుకునేందుకు యత్నించాడు. షాపు డోర్లు తెరుచుకోలేదు. దాంతో కంగుతిన్న దొంగ.. చేసేది ఏమిలేక మెడలో వేసుకున్న బంగారు గొలుసు తిరిగి యజమానికి ఇచ్చేశాడు. యువకుడు పంతంగ్ తీరును ముందుగానే అనుమానించిన యజమాని.. అతడు లోపలికి రాగానే షాపు డోర్లను రిమోట్ సాయంతో లాక్ వేశాడు. అది తెలియని పంతంగ్.. పారిపోయేందుకు యత్నంచిన ఫలితం లేకపోయింది. ఇంతలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిని అదుపులోకి తీసుకొని కస్టడీకి తరలించారు. ఇలాంటి కేసులు గతంలోనూ కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది మలేసియాలో జ్యుయలరీ షాపులో దోపిడీకి యత్నంచిన దొంగలు జ్యుయలరీ పెట్టె తెరవడంలో విఫలమై ఉత్త చేతులుతోనే వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు