అసెంబ్లీలో బలనిరూపణ

Updated By ManamTue, 05/15/2018 - 18:05
Yadyurappa and Kumaraswamy meets Governor
  • గవర్నర్‌ను కోరిన యడ్యూరప్ప.. వారం రోజుల గడువుకు విజ్ఞప్తి

  • ఆ వెంటనే గవర్నర్‌ను కలిసిన కుమారస్వామి, సిద్దరామయ్య

  • రెండు రోజుల్లో నిర్ణయం చెప్తానన్న గవర్నర్ వాజాభాయ్ వాలా

Yadyurappa and Kumaraswamy meets Governorబెంగళూరు: కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై నిముషనిముషానికి పరిస్థితులు మారుతున్నాయి. తామే వంద శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన ఆయన.. బలనిరూపణకు వారం రోజుల గడువు కోరారు. బలాన్ని నిరూపించుకునేందుకు కొన్ని రోజులు సమయమివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జేడీఎస్‌లోని ఓ వర్గం మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప గవర్నర్‌ను కోరారు. దానిపై మరో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని గవర్నర్.. యడ్యూరప్పకు చెప్పారు. మరోవైపు గవర్నర్‌ను యడ్యూరప్ప కలిసిన కొద్దిసేపటికే జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామితో కలిసి కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గేలు గవర్నర్‌ను కలిశారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అందుకు సంబంధించిన మెజారిటీ తమకు ఉందని కుమారస్వామి గవర్నర్‌కు తెలిపారు. వారికి కూడా ఏ విసయమనేది రెండు రోజుల్లో ప్రకటిస్తానని గవర్నర్ చెప్పినట్టు కుమారస్వామి వర్గం పేర్కొంది. కాగా, జేడీఎస్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తోందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాల్సిందిగా లిఖిత పూర్వకంగా గవర్నర్‌ను కోరామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. అంతేగాకుండా దేవెగౌడ కూడా గవర్నర్‌కు లిఖితపూర్వకంగా ఆ విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. 

English Title
Yadyurappa and Kumaraswamy meets Governor
Related News