మహిళల మినీ యుద్ధం

Updated By ManamFri, 11/09/2018 - 02:48
india-womens

india-womensప్రొవిడెన్స్ (గయానా): నేటి నుంచి ప్రారంభకాబోయే వరల్డ్ టీ20లో భారత మహిళల జట్టు తొలి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించాలనే కసితో ఉంది. ఈ టోర్నీలో భాగంగానే టీమిండియా మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో పోటీపడనుంది. గతేడాది ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టు పొట్టి ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని జట్టుకు బలంగా ఇటీవలె రమేష్ పొవార్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది వరల్డ్‌కప్‌లో జరిగిన తప్పులను ఇక్కడ పునరావృతం చేయకుండా యువ క్రీడాకారిణిలతో నిండి ఉన్న టీమిండియా ఈ సారి ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. గత ఐదేళ్లలో భారత మహిళల జట్టు ఇంతవరుకూ ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్‌ను గెలవలేకపోయారు. 2009, 2010లో సెమీస్‌కు చేరిన తర్వాత ముందుకు సాగ లేకపోయారు. ప్రస్తుతమమున్న భారత్ జట్టు టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవల శ్రీలంక, ఆస్ట్రేలియా ఎ జట్లతో జరిగిన టీ20 సిరీస్‌లో చిత్తుగా ఓడించింది. ఈ ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లతో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఆసియా కప్ టీ20లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన టీమిండియా కరేబియన్ గడ్డపై అత్యుత్తమైన ఆటతీరును ప్రదర్శించనుందని ఓపెనర్ స్మృతి మంధన ధీమా వ్యక్తం చేసింది.

 ‘ ఆసియా కప్ తర్వాత మేము ఆడబోయే ప్రతిష్టాత్మక టోర్నీ ఇది. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతున్నారు’ అని మంధన తెలిపింది. ‘ నాకు వ్యక్తిగతంగా శ్రీలంకతో జరిగిన సిరీస్ చాలా బాగుంది. ఆ సిరీస్‌లో నేను మెరుగైన ప్రదర్శన కనబరచలేదు. ఒక్క మ్యాచ్‌లో నేను, హర్మన్‌ప్రీత్ ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాం. ఆ మ్యాచ్‌లో మా జట్టు స్కోరు 170. అది అద్భుతం. గత మూడు నెలల నుంచి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వారి ప్రణాళికలు వాళ్లు చక్కగా అమలుచేస్తునారు. ఇక ఫీల్డింగ్ విషయానికొస్తే మేము గత ప్రపంచ కప్‌లో కనబరిచిన ఫీల్డింగ్ కంటే 10 శాతం ఫీల్డింగ్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాం’ అని మంధన చెప్పింది. భారత జట్టు బ్యాటింగ్ విభాగంలో అద్భుతంగా ఉంది. ఓపెనర్లు స్మృతి మంధన మంచి ఫామ్‌లో ఉంది. యువ క్రీడాకారిణీ రొడిగ్రజ్, తన్యా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో మిడిలార్డర్ బలంగా ఉంది. స్పిన్ విభాగంలో అత్యంత అనుభవజ్ఞురాలైన పూనమ్ యాదవ్ కీలక పాత్ర పోషించనుంది. గత మూడు ఎడిషన్‌లో భారత్ జట్టు గ్రూప్ స్టేజ్ దాటి నాకౌట్ కూడా చేరకోలేపోయింది. శుక్రవారం న్యూజిలాండ్‌తో పోటీపడనున్న టీమిండియా ఆదివారం చిరకాల ప్రతర్థి అయినా పాకిస్థాన్‌తో తలపడనుంది. నవంబర్ 15న ఐర్లాండ్ తో, 17న ఆస్ట్రేలియా తో మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా మాజీ స్పిన్నర్, మహిళల జట్టు కోచ్ రమేష్ పొవార్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు రాణిస్తుందని ఆశిస్తున్నాడు. ‘ క్రీడాకారిణిలంతా వ్యక్తిగతంగా వృద్ధి చెందారు. వారితో పాటు జట్టు, భారత మహిళల క్రికెట్ జట్టు అభివృద్ధి చెందింది. ఈ టోర్నీలో భారత్ జట్టు ఎన్నో రికార్డులు క్రియేట్ చేయనుంది’ అని పొవార్ తెలిపారు. 

ఇండియా: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), తన్యా భాటియా (వికెట్ కీపర్), ఏక్తాబిష్ట్, హేమలత, జో షి, వేద కృష్ణమూర్తి, స్మృతి మంధన, అనూజ పా టిల్, మిథాలీ రాజ్, అరుంధ తి రెడ్డి, రొడ్రిగస్, దీప్తి శర్మ, పూజా, రాధ యాదవ్, పూనమ్ యాదవ్. న్యూజిలాండ్: అమీ సాటర్థ్వైట్ (సి), సోఫీ డేవిన్, కేట్ ఇబ్రహీం, మాడీ గ్రీన్, హుడ్లెస్టన్, హేలే జెన్సెన్, లీ కస్పెరేక్, అమేలియా కెర్, కేటీ మార్టిన్, అన్నా పీటర్సన్, హ్యారియెట్ రోవ్, లీ తహుహు, జెస్ వాట్కిన్, సుజీ బేట్స్, బెర్నాడిన్ బెజు యిడెన్హౌట్(వికెట్ కీపర్).

English Title
Women's Mini Battle
Related News