మహిళలకూ బాధ్యతా.. వద్దు!

Updated By ManamWed, 07/11/2018 - 23:34
supreme-court

supreme-courtవివాహేతర సంబంధాలలో కేవలం పురుషులనే కాక మహిళలను కూడా బాధ్యులను చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖైలెన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు బుధవారం ఫిడవిట్ దాఖలు చేసింది.  ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం భార్య కాని మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు పురుషుడిని మాత్రమే బాధ్యుడిగా చేస్తున్నారు. వైవాహిక వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకే సెక్షన్ 497 ఉందని, అలాంటి చట్టాన్ని నీరుగారిస్తే వివాహబంధం దెబ్బతింటుందని కేంద్రం చెప్పింది. ప్రస్తుతం ఇటలీలోని ట్రెంటోలో ఉంటున్న కేరళవాసి జోసెఫ్ షైన్ దాఖలుచేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. వివాహేతర సంబంధాల విషయంలో  పురుషుడు ఒక్కడే తప్పు చేసినట్లు కాదని, సంబంధానికి అంగీకరించిన వేరే వ్యక్తి భార్యది కూడా తప్పేనని ఆయన తన పిటిషన్‌లో వాదించారు. ఇలాంటి సంబంధాల విషయంలో మహిళల పాత్ర ఎలా ఉన్నా వాళ్లను నిర్దోషులుగా విడిచిపెడుతూ, పురుషుడిని మాత్రమే బాధ్యుడిని చేసే చట్టం అనాగరికమని పిటిషనర్ తరఫు న్యాయువాది కాళీశ్వరం రాజ్ వాదించారు. అదే పెళ్లికాని మగ, ఆడ; పెళ్లికాని మగ - పెళ్లయిన ఆడ; పెళ్లయిన మగ - పెళ్లికాని ఆడవారి మధ్య అంగీకారంతో కూడిన లైంగిక సంబంధం మాత్రం తప్పు కాదని ఈ సెక్షన్ చెబుతోందన్నారు. ప్రస్తుతం  ఆడవారిని బాధితులుగా భావించి నిర్దోషులుగా విడిచిపెడుతున్నారని, ఒకరికి మాత్రమే శిక్ష విధించడం ఎంతవరకు సబబో పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

English Title
Women are responsible ..
Related News