బైక్‌లో పెట్రోల్ ఫుల్‌ ట్యాంకు.. అంతలోనే..

Updated By ManamFri, 09/14/2018 - 16:48
Bike, engulfed flames, petrol pump, refill full tank

Bike, engulfed flames, petrol pump, refill full tankచెన్నై: దేశవ్యాప్తంగా ఇందన ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.90 మార్క్‌ను దాటేయగా, డీజిల్ లీటర్ రూ.80 మార్క్‌ను దాటేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ ద్విచక్ర వాహనదారుడు హడావుడిగా పలాయంకొట్టాయి పెట్రోల్ బంక్ వద్దకు దూసుకొచ్చాడు. అర్జెంట్‌గా తన బైక్‌లో రూ.1000ల పెట్రోల్‌ను పుల్ ట్యాంకు చేయమని చెప్పాడు. కానీ, ట్యాంకు పరిమితికి మించి రూ.900ల పెట్రోల్ పోయించుకొన్నాడు.

నగదు చెల్లించిన అనంతరం అల్విన్ అనే వ్యక్తి బైక్ స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరేగాయి. అతని బట్టలకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది అగ్నిమాపక యంత్రంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాలిన గాయాలతో బాధపడుతున్న అల్విన్‌ను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి బైక్ మంటల్లో దగ్ధమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

English Title
Watch: Bike engulfed in flames at petrol pump after man refill it to full tank
Related News