ఈ అనుభవం గొప్పగా ఉంది - విద్యాబాలన్

Updated By ManamFri, 08/10/2018 - 17:21
Vidya Balan

vidya balanబాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘యున్.టి.ఆర్’. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. కాగా ఆయన సతీమణి బసవతారకమ్మ పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. సినిమాలో తన పాత్ర గురించి విద్యాబాలన్ కొన్ని విషయాలను తెలియుజేశారు. ‘గతంలో నేను మలయాళ చిత్రంలో రెండు, మూడు సీన్స్‌లో నటించాను. అయితే దక్షిణాదిలో పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్న చిత్రం `యన్.టి.ఆర్`. ఇందులో తెలుగు డైలాగులు కూడా చెప్పాను. అవి రేపు తెరపై ఎలా ఉంటాయో చూడాలని ఆసక్తిగా ఉంది. షూటింగ్‌ను ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసి..సాయంత్రం ఆరు గంటలకంతా పూర్తి చేస్తున్నారు. చాలా ప్రొఫెషనల్ టీమ్‌తో పనిచేస్తున్న  ఈ అనుభవం గొప్పగా ఉంది’ అన్నారు విద్యాబాలన్. 

English Title
Vidya Balan about NTR team
Related News