వాజపేయి ఓకే!

Updated By ManamThu, 06/14/2018 - 00:37
vajpayee
  • ఆరోగ్యం మెరుగుపడుతోంది.. మూత్రపిండాల పనితీరు భేష్

  • అదుపులోకి శ్వాసనాళ ఇన్ఫెక్షన్.. గుండె, శ్వాస, బీపీ సాధారణం

  • త్వరలో పూర్తిస్థాయిలో స్వస్థత.. ఎయిమ్స్ వైద్యుడు డా. గులెరియా

vajpayeeన్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం విషయంలో అఖిలభారత వైద్య విజ్ఞాన కేంద్రం (ఎయిమ్స్) సీనియర్ వైద్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులెరియా శుభవార్త వినిపించారు. ఆయన మూత్రపిం డాల పనితీరు మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని చెప్పారు. గుండె కొట్టుకునే రేటు, శ్వాస తీసుకునే వేగం, రక్తపోటు కూడా సాధరాణంగానే ఉన్నాయని తెలిపారు. వాటన్నింటికీ ఎలాంటి సపోర్టు తాము ఇవ్వడం లేదని.. అయినా బాగానే ఉంటున్నాయని అన్నారు. గడిచిన 48 గంటలుగా ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, రాబోయే కొన్ని రోజుల్లో వాజ్‌పేయి పూర్తి స్థాయిలో కోలుకుంటారన్న ఆశాభావం తమకుందని తెలిపారు. మూత్రం కొద్దిమొత్తంలోనే వస్తుండటంతో చిన్నపాటి డయాలసిస్ చేశామన్నారు. ఆ తర్వాత మూత్రపిండాలు సాధారణ స్థితికి వచ్చాయని, మూత్ర విసర్జన కూడా తగినంతగా ఉందని వివరించారు. ఇన్ఫెక్షన్లు అన్నీ అదుపులోకి వచ్చాయని డాక్టర్ గులెరియా అన్నారు. మొత్తమ్మీద ఆయన రోగ్యం బాగుందని ప్రకటించారు. ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోందని తెలిపారు. సోమవారం నాడు తీవ్ర అస్వస్థతతో ఎయిమ్స్‌లో చేర్చిన వాజ్‌పేయిని అక్కడి కార్డియో థొరాసిక్, వాస్క్యులర్ సైన్సెస్ విభాగంలోని ఐసీయూలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. డాక్టర్ రణ్‌దీప్ గులెరియా నేతృత్వంలోని వైద్యబృందం ఆయనకు సేవలు చేస్తోంది. వాజ్‌పేయి ఉన్న దృష్ట్యా మొదటి అంతస్తులోని ఐసీయూ మొత్తాన్ని దుర్భేద్యమైన దుర్గంలా మార్చేశారు. 

Tags
English Title
Vajpayee is okay!
Related News