ముగ్గురు పిల్లలకు ఇద్దరు టీచర్లు

Updated By ManamFri, 06/22/2018 - 01:54
image

imageమహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలు శివారు రేకులతండా ప్రాధమిక పాఠశా లలో ఇద్దరు టీచర్లు ముగ్గురు విద్యార్ధులు మాత్రమే  పాఠశాలకు వస్తుం డటంతో ఏం చేయాలో పంతులమ్మలకు  అర్ధంకాని పరిస్థితి. గత సంవ త్సరం ఈ పాఠశాలలో 25 మంది విద్యార్ధులు ఉండే వారని ఇప్పుడు డోర్నకల్ మండలం మన్నెగూడెంలో అనాధశ్రానికి చెందిన వ్యక్తి వచ్చి  ఇక్కడ చదివే 22 మంది విద్యార్ధులను తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్పించ టంతో ముగ్గురు విద్యార్ధులు మాత్రమే మిగిలారు.

దాంతో  మేము తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి మా సొంతంగా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కొనిస్తామని చెప్పినప్పటికి కూడా పట్టించుకోవటంలేదని టీచర్లు తిరుమ ల, రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా పెద్దపెల్లి శివారు కుమ్మరిబోడు ప్రాధమిక పాఠశాలలో కూడా ఇద్దరు విద్యార్ధులు ఒక టీచ రు ఉన్నారు. దీంతో ఈ  విద్యాసంవత్సరం కురవి మండలంలో సగం ప్రాధమిక పాఠశాలలు  మూతపడే అవకాశలు స్పష్టంగా కనపడుతున్నాయి.

English Title
for Two children three teachers
Related News