కూలిన రెండు అమెరికా యుద్ధ విమానాలు..

Flights
  • ఐదుగురు సిబ్బంది గల్లంతు

టోక్యో: అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు జపాన్‌లో కుప్పకూలాయి. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు..తక్షణం జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సు రంగంలోకి దిగి వీరిని రక్షించేం దుకు చర్యలు ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు. ఎఫ్/ఏ ఫైటర్ జెట్‌లో ఇద్దరు సిబ్బంది ఉండగా ఈ విమానానికి ఇంధనం నింపుతున్న కేసీ-130 ట్యాంకర్‌లో ఐదుగురు సిబ్బంది ఉండగా ఈ రెండు విమానాలు ప్రమాదవశాత్తు సముద్రంలో కుప్పకూలాయి. వీరిలో ఒకరిని తాము సురక్షితంగా కాపాడగలిగినట్టు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి ఆచూకి కోసం 9 విమానాలు, మూడు ఓడల్లో సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సులతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.  విమానాలు కూలిన ప్రాంతంలో దట్టమైన పొగమంచు అలముకుని ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

Tags

సంబంధిత వార్తలు