బహుజన రాజ్యం దిశగా...

Updated By ManamWed, 06/20/2018 - 08:07
image

imageవయోజన ఓటింగ్ విధానం ప్రజలకు ప్రజా స్వామ్యం కల్పించిన గొప్ప బహుమానం. దీని ద్వారా 18 ఏళ్లు నిండిన యువత యధేచ్చగా తమతమ ప్రతి నిధులను చట్టసభలకు పంపించి, తమ భావాలను వ్యక్తపరుస్తూ, తమ డిమాండ్లను నెరవేర్చుకునే సదవ కాశం. నేడు ప్రపంచంలో కెల్లా ఎక్కువగా యువత అంటే 40 సం‘ల లోపు వయసున్న తరం కలిగిన యువ భారతం వైపు ప్రపంచ దేశాల దృష్టి పడింది. అంటే ఎక్కువ చైతన్యం కలిగి, కొత్తరకమైన మార్పు లు తీసుకురాగల సత్తా ఉన్న యువరక్తం నేడు భారత దేశంలో పొంగిపొర్లుతోంది. అదేవిధంగా అత్యధిక విద్యావంతులు కలిగి ఉండి నైపుణ్యాల పరంగా గాని, జాతిని ఐక్యత వైపు నడిపించి దేశాన్ని ప్రపంచంలో ముందు వరుసలో ఉంచగల సత్తా ఉన్న దేశం మనది.

దురదృష్టవశాత్తు యువత నిరాశ నిస్పృహలతో నిరుద్యోగబారిన పడి, విద్యావంతులైనప్పటికీ తమని తాము పోషించుకోలేని స్థితిలో, పెత్తందారి వర్గాల రాజకీయ పార్టీల నాయకులతో చేతులు కలిపి సిద్ధాం తాలను తుంగలో తొక్కి, సమాజ శ్రేయస్సు కంటే వ్యక్తి అభివృద్దే ద్యేయంగా, ఛోటా మోటా రాజకీయ నాయకుల పంచన చేరి చెంచాలుగా మారి గులాంగిరి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపార వరా ్గలన్నీ రాజకీయాలను శాసిస్తూ, పదవులను కొనుక్కుం టూ, నేటి యువతరాన్ని కూడా వారి అవసరాలను ఆసరాగా చేసుకుని, తమ అవకాశాలకు వారిని వాడు కుంటున్నారు. ఎటువంటి సిద్ధాంతాలు లేని కనీసం చదువు సంధ్యా లేని నాయకులకు జేజేలు పలు కుతూ, ఇప్పుడు కొత్తగా వచ్చిన కల్చర్ అయిన ఫ్లెక్సీ లను కడుతూ అందులో సదరు నాయకుణ్ణి టైగర్ అని, ప్రజల పక్షపాతి అని, అన్న అని, దీనభాంధవు డని,అభివృద్ధి ప్రదాత అని, జాతి రత్నం అని, పేదల పెన్నిధి అని, ఆశాజ్యోతి అని, స్వయానా బిరుదాంకితుణ్ణి చేసి యువ సేనల పేరుతో, సింహాల సరసన తన ఫోటోను పెట్టి రోడ్లపై ఊరేగిస్తున్నారు. యూనివర్సిటీ స్థాయిలో ఉన్నత విద్యనభ్యసించి చదు వును, సిద్ధాంతాలను, విలువలను తాకట్టు పెడుతూ తమను తాము మానసికంగా తాకట్టు పెడ్తున్నారు. చిన్నా చితకా పదవులను ఆశించి, కొంత గుర్తింపును కోరుకొని, ఆర్థిక అవసరాల కోసం జిందాబాదులు కొడుతూ చెంచాగిరి చేస్తున్నారు. దీనివల్ల మన అభి వృద్ధి వెనక్కి వెళ్లి నాయకులు అభివృద్ధి అమాంతం రెట్టింపులవసాగాయి.

ఎన్నికలు సమీపిసున్నాయంటే లీడర్లకు ఎంతో విలువ చేసే మార్కెట్ సరుకు లాగా యువకులు గులాంగిరి చేయాల్సిన దుస్థితి. ఈ వస్తు వ్యామోహ వినిమయ ప్రపంచంలో పక్కవాడి కంటే ఎక్కువ సం పాదించాలనే కాంక్షతో మనుషుల విలువలు దిగజారి పోయి తమ వర్గాన్ని, జాతిని, కులాన్ని తాకట్టు పెట్టుకునే చెంచాలుగా తయారవుతున్నారు. విద్య నభ్యసించిన యువతరం గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యం చేయాల్సింది పోయి అక్కడ ఏదో పార్టీకి చెంచాలుగా మారి వ్యక్తితిగతాభివృద్ధిని మాత్రమే చే సుకుంటున్నారు. యువతరం పెరిగిన సందర్భాల్లో రాజకీయాల్లో బ్రహ్మాండమైన మార్పులు చోటు చేసు కొని, ప్రజల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృ తికంగా విన్నూత్నమైన మార్పులు చోటు చేసుకోవా లి. యువత తాత్కాలిక సుఖాలకు, భోగాలకు, మద్యానికి బానిసలవ్వకుండా గులాంగిరి చేయకుండా స్వీయ నియంత్రణలో సొంత స్వచ్ఛమైన కల్మషం లేని వ్యక్తిత్వంతో వ్యవస్థలో మార్పుకు కృషి చేయాలి.

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో దాసరి నారాయణ  సినిమాలో పాటలాగా ‘జెండై వాడెగురుతాడు కట్టై మనం మిగులుతున్న‘ పరిస్థితి నేటికి వున్నది.స్వాతంత్య్రానికి పూర్వం నుంచి గాంధీ కాంగ్రెస్ పార్టీలు ఖిఇ, ఖిఖీ, ఆఇ, మైనార్టీ వర్గాలను చెంచాలుగా మార్చి రాజకీయ అవసరాలకు వాడుకొని అందల మెక్కారు. అనతి కాలంలో డాక్టర్ అంబేడ్కర్ ఆయా వర్గాలను ఐక్యం చేయాలని ఎంత ప్రయత్నించారో, వారిని విడదీయడానికి కాంగ్రెస్ వాళ్లు అంతకంటే ఎక్కువ పన్నాగం పన్నింది. జ్యోతిరావు పూలే ‘గులాంగిరి’, అంబేడ్కర్ ‘రాజ్యాంగం’, కాన్షీరాం ‘చెంచాయుగం’ గ్రంథాలను నేటి యవతరం అవగాహన చేసుకుని అధికారాన్ని కైవశం చేసుకునేలా ఎదగాలి. ‘ కులం పునాదుల మీద ఒక జాతిని గాని, నీతిని గాని నిర్మించలేమన్న అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ, కేంద్ర, రాష్ట్ర స్థాయి పార్టీల్లో శాఖలుగా కుల సంఘాలను ఏర్పరుసూ వాటికి  ప్రతినిధులుగా వ్యవహరిస్తూ తమ ఆత్మ గౌరవాన్ని ఆధిపత్య కులాల వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు. కేవలం మతాన్నే ఎజెండాగా చేసుకున్న పార్టీల పంచ న యువత చేరి దేశభక్తి పేర ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతూ దేశ ఔన్నత్యాన్ని, లౌకికత్వాన్నీ దెబ్బ తీసే విధంగా, హిందువులు మాత్రమే భారతీయుల న్నట్లుగా హిందూ ఫాసిస్టు పార్టీ దగ్గర మోకరిల్లుతున్నారు. ఇవే కాకుండా దళిత, గిరిజన, బీసీ కులసంఘాలంటూ పార్టీలకతీతమని కొత్త దుకా ణాలు తెరిచి తమ పబ్బం గడుపుకుంటూ ప్రజల అవసరాలను గాలికొదిలేస్తున్నారు.

ఏ కులానికి ఆ కులం, ఏ మతానికి ఆ మతం ఏకం కావాలని నినదిస్తున్నారు తప్ప భారతీయులంతా ఏకం కావా లని ఎవ్వరూ నినదించకపోవడం బాధాకరమైన విష యం. సబ్బండ వర్గాల ఐక్యతను, సమసమాజ స్థాపనను పక్కన పెట్టి ఆంగ్లేయులు నేర్పించిన విభజించు-పాలించుసూత్రాన్నే ఇంకా అవలంబిస్తూ, కులాలు-మతాలుగా విచ్చిన్నమవుతన్నారే తప్ప భర త జాతిని ఏకం చేయలేకపోతున్నారు. అంబేడ్కర్  నినాదమయిన ‘బోధించు, సమీకరించు, పొరాడు’ అనే సూత్రంతో ముందుకెళ్లి ప్రజల్లో చైతన్యం నింపి, జాతిని జాగురుకత చెయ్యాల్సిన బాధ్యత యువత భుజస్కంథాలపై వున్నది. యువత ప్రజలతో మమే కమై, ఎవ్వడికి చెంచాలుగా మారి గులాంగిరి చెయ్య కుండా,నూతన ప్రజాస్వామిక మార్పుకై నాంది పలుకుతూ సబ్బండ వర్గాలను కూడ గట్టుకొని బహుజన రాజ్యాధికారం దిశగా యువతరం పయనించాలి.


- ముఖేష్ సామల
9703973946

English Title
Towards the Bahujan state
Related News