'బీజేపీ వస్తే.. భవిష్యత్‌లో ఎన్నికలుండవు' 

Updated By ManamFri, 09/14/2018 - 20:15
No Further Elections, BJP, Voted Back to Power, 2019 Akhilesh Yadav

No Further Elections, BJP, Voted Back to Power, 2019 Akhilesh Yadavలఖ్‌నవూ: యూపీ మాజీ సీఎం, సామాజ్‌వాదీపార్టీ నేత అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో ఇక ఎన్నికలు ఉండవని వ్యాఖ్యానించారు. ఘాజిపూర్‌లో శుక్రవారం ‘సామాజిక న్యాయ యాత్ర ’ సైకిల్ యాత్ర ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అఖిలేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలంతా పకోడీలు వేసేందుకు కళాయి, గంటెను సిద్ధం చేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

ఇది తమ మాట కాదని, చాలామంది సామాజిక ఆలోచనపరులు, వారి స్నేహితులంతా బీజేపీ 2019లో అధికారంలోకి వస్తే దేశంలోని ప్రజాస్వామ్యం అణగారిపోతుందని అంటున్నారని అఖిలేశ్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎన్నికలు ఉండకపోవచ్చనని, 2019లో విపక్షాలన్నీ ఏకమై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ వాతావరణ పరిస్థితుల్లో కుల రాజకీయమనే విషాన్ని బీజీపీ వ్యాపించజేసిందని అఖిలేశ్ విమర్శలు గుప్పించారు. ‘‘2019 ఎన్నికలు ఓ పరీక్షలాంటిదని.. అందులో మనం ఫెయిల్ అయినట్టయితే.. మనమంతా కలిసి ఓ కళాయిని పట్టుకొని చక్కగా పకోడీలు వేసుకోవాల్సిందే’’ అని అఖిలేశ్ వ్యంగ్యస్త్రాలను సంధించారు. 

English Title
There Will be No Further Elections if BJP is Voted Back to Power in 2019, Says Akhilesh Yadav
Related News