కన్నీళ్లు పెట్టుకున్న గవాస్కర్

Gavaskar

ముంబై: చరిత్రాత్మక టెస్ట్ సిరీస్ చేజిక్కించుకున్న అనంతరం సోమవారం టీమిండియా సిడ్నీలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని అందుకోవడం చూసి కన్నీటి పర్యంతమయ్యానన్నారు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వాహకుల తప్పిదం కారణంగా ఆయన ట్రోఫీ బహుకరణ కార్యక్రమానికి హాజరుకాలేపోయారు. ఆస్ట్రేలియాలో భారత్ 2-1 తేడాతో తొలిసారి చారిత్రక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘చాలా గర్వంగా ఉంది. ఈ చారిత్రక సన్నివేశాన్ని చూసిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యాను. ఇదొక గొప్ప రోజు కాబట్టి నేను అక్కడ ఉండి ట్రోఫీని అందిస్తే ఇంకా అద్భుతంగా ఉండేది. వారి గెలుపు, ట్రోఫీని అందుకోవడాన్ని చూడటం నిజంగా మధురానుభూతి’ అని గవాస్కర్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ పేర్ల మీద ఏర్పాటు చేసిన ఈ ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి ప్రతిసారి గావస్కర్ హాజరవుతారు. అయితే సిడ్నీలో జరిగిన చరిత్రాత్మక ఈవెంట్‌కు మాత్రం ఆయన మిస్సయ్యారు. అక్కడికి వెళ్లలేకపోవడంపై మాజీ కెప్టెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags

సంబంధిత వార్తలు