సత్తా చూపిన టాటా స్టీల్

Updated By ManamThu, 05/17/2018 - 22:32
Tata-Steel-Posts-Profit
  • మార్చి త్రైమాసికానికి రూ. 14,600 కోట్ల లాభం

Tata-Steel-Posts-Profitముంబయి: మార్చితో ముగిసిన త్రైమాసికానికి టాటా స్టీల్ రూ. 14,688 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఒక తడవ లబ్ధి రూ. 14,077 కోట్లతో లాభం పెంపొందింది. గత ఏడాది అదే కాలంలో, కంపెనీ రూ. 1158 కోట్ల నికర నష్టాన్ని కనబరచింది. ఏకీకృత మొత్తం రెవిన్యూలు  రూ.35,304.89 కోట్ల మేరకు ఉన్నాయి. ఆర్డినరీ షేర్‌పై రూ. 10, పార్ట్లీ-పెయిడ్ ఆర్డినరీ షేర్‌పై రూ. 2.50 చొప్పున కంపెనీ డివిడెండ్ ప్రకటించింది. 

యు.కె. పెన్షన్ స్కీమ్
ఒక విడత లబ్ధి గురించి వివరిస్తూ కంపెనీ, యునైటెడ్ కింగ్‌డమ్ పెన్షన్ పునర్నిర్మాణ మొత్తం ప్రక్రియ పూర్తయిందని, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ (ఐ.ఎ.ఎస్) 19 కింద  కొత్త స్కీమ్‌లో నాన్-క్యాష్ 2.2 బిలియన్ పౌండ్ల అకౌంటింగ్ మిగులు ఉందని తెలిపింది. దీనిలో, 1.64 బిలియన్ పౌండ్ల (రూ. 14,077 కోట్ల) నాన్-క్యాష్ లబ్ధిని ఆ త్రైమాసికంలో ఆసాధారణ లబ్ధి కింద పరిగణించారు. పెన్షన్ పథకానికి ఈ మిగులు మద్దతు కొనసాగుతుంది. సభ్యులను కాపాడుకుంటూ రిస్క్ తక్కువ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహానికి అవసరమైన కార్యక్రమం కొనసాగించే వీలుంది. పెన్షనర్లకు, ప్రస్తుత ఉద్యోగులకు, బ్రిటన్ వ్యాపారానికి ఇది సర్వోత్తమ, స్థిరమైన ఫలితం అవుతుంది. కోరస్ గ్రూప్ స్వాధీనానికి 2007 ఏప్రిల్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు 1.7 బిలియన్ పౌండ్ల చార్జీలను టాటా స్టీల్ యు.కె పుస్తకాల నుంచి లాభ, నష్ట పద్దు ద్వారా లేదా  పాత బ్రిటిష్ స్టీల్ పెన్షన్ స్కీమ్ (బి.ఎస్.పి.ఎస్)కి సంబం దించి ఇతర సమగ్ర ఆదాయం ద్వారా ఆ మొత్తాన్ని  స్వీకరించారు. అంతేకాకుండా, 2017 సెప్టెంబర్ త్రైమాసికంలో, టాటా స్టీల్ యు.కె నుంచి బి.ఎస్.పి.ఎస్ వేరు పడినప్పుడు, దామాషా ప్రకారం ఆస్తిని విభజించి పంచే నియమానసరణ ఏర్పాటు కింద 554 మిలియన్ల పౌండ్లను, కంపెనీ ఈక్విటీ వాటాలో 33 శాతాన్ని ఆ స్కీమ్‌కు బదలీ చేశారని కంపెనీ తెలిపింది. టిసెన్‌క్రప్‌తో బైండింగ్ సంయుక్త రంగ ఏర్పాటుపై ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సంతకాలు జరుగగలవని భావిస్తున్నారు. గనుల తవ్వక కలాపాలకు సంబంధించి రెగ్యులేటరీ అథారిటీల నుంచి వచ్చిన కొన్ని డిమాండ్లు, క్లైమ్‌లకు సంబంధించి జరిపిన రూ. 1484 కోట్ల నికర కేటాయింపుతో సహా అసాధారణ చార్జీ కింద రూ. 1607 కోట్ల చార్జీని కూడా కంపెనీ గుర్తించింది. కళింగనగర్ ప్లాంట్‌లో సామర్థ్యాన్ని పెంపొం దించుకోవడం వల్ల  భారతీయ కలాపాల నుంచి పరిమాణ వృద్ధి బయ టి మార్కెట్‌కన్నా మెరుగ్గా ఉందని టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ చెప్పారు. ‘‘కళింగనగర్ విస్తరణ వల్ల మా క్రూడ్ ఉక్కు సామర్థ్యం ఏడాదికి 13 మిలియన్ టన్నుల నుంచి 18 మిలియన్ టన్నులకు పెరిగింది. భూషణ్ స్టీల్‌కి మేం సమర్పించిన పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీలా ట్రైబ్యునల్ ఆమోదం తెలుపడం కూడా నాకు సంతోషం గా ఉంది. ఈ లావాదేవీకి సి.సి.ఐ ఆమోద ముద్ర కూడా లభించింది’’ అని నరేంద్రన్ అన్నారు. 

Tags
English Title
Tata Steel shown by Satata
Related News