యన్.టి.ఆర్‌లో స్వీటీ

Updated By ManamFri, 11/09/2018 - 03:14
anushka

imageదివంగత మాజీ ముఖ్య మంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో జనవరి 9న ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ విడుదలవుతుంటే జనవరి 24న ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ విడుదలవుతుంది. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ వేల్యూ రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ వరుసలో అనుష్క కూడా చేరింది. ఎన్టీఆర్‌తో నటించిన పలువురు హీరోయిన్స్ పాత్రల్లో నేటి తరం కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, షాలిని పాండే తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో స్వీటీ అనుష్క కూడా చేరనుందని సమాచారం. వివరాల్లోకెళ్తే.. స్వర్గీయ ఎన్టీఆర్‌తో అప్పట్లో బి.సరోజా దేవి కలిసి నటించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు బయోపిక్ పార్ట్ వన్‌లో బి.సరోజా దేవి పాత్రలో అనుష్క నటించనుంది. త్వరలోనే అనుష్క షూటింగ్‌లో పాల్గొంటుంది. 

English Title
Sweaty in NTR
Related News