నిర్భయ దోషులకు మరణ శిక్ష సబబే..

Updated By ManamMon, 07/09/2018 - 14:19
 Nirbhaya Rapists
No mercy for Nirbhaya rapists

న్యూఢిల్లీ  : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో దోషుల రివ్యూ పిటిషన్‌పై  సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది. దోషులకు మరణ శిక్షే సరైందిగా న్యాయస్థానం  కీలక తీర్పునిచ్చింది. మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చారంటూ దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌‌పై విచారణ జరపాల్సిన అవసరమే లేదంటూ ఉన్నత ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీంకోర్టు విధించిన మరణశిక్షలపై తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్‌(29), పవన్‌ గుప్తా(22), వినయ్‌ శర్మ(23) రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివ్యూ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ వచ్చింది.

కాగా పారా మెడికల్ విద్యార్థిని అతిక్రూరంగా లైంగిక దాడి చేసి చంపినవారికి ట్రయల్‌ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను సమర్థిస్తూ 2017 మే నెలలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
 

English Title
Supreme court verdict in Nirbhaya case
Related News