సింధు, సైనా రెడీ

Updated By ManamTue, 10/16/2018 - 06:20
Sindhu,-saina

Sindhu,-sainaడెన్మార్క్: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, సైనా నేహ్వాల్ మంగళవారం నుంచి ప్రారంభంకాబోయే డెన్మార్క్ ఓపెన్ టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ టోర్నీలో సింధు మూడో సీడ్‌గా బరిలోకి దిగుతుంది. సింధు మొదటి మ్యాచ్‌లో అమెరికాకు చెందిన బీవాన్ జంగ్‌తో మహిళల సింగిల్స్‌లో తలపడనుండగా, సైనా మొదటి రౌండ్‌లో హంకాంగ్‌కు చెందిన చియాంగ్ యితో పోటీపడనుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 6వ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ ఏడో సీడ్‌గా ఈ టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో శ్రీకాంత్ డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియన్ సోల్‌బెర్గ్‌తో పోటీపడనుండగా, సాయి ప్రణీత్ తొలి మ్యాచ్‌లో చైనాకు చెందిన హుయంగ్‌తో ఆడనున్నాడు. మరో భారత షట్లర్ సమీర్‌వర్మ మొదటి రౌండ్‌లో చైనాకు చెందిన మూడో సీడ్ షీయకీతో పోటీపడనున్నాడు. వీరితో పాటు ప్రణయ్ మొదటి రౌండ్‌లోనే కొరియాకు చెందిన ఆరో సీడ్ సన్ వాన్ హోతో పోరుకు సిద్ధమయ్యాడు. పురుషుల డబుల్స్‌లో మను అట్రి- సుమీత్ రెడ్డి జోడి కిమ్- అండర్స్ స్కరాప్ జంటతో ఆడనున్నారు. మిక్సిడ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- సాత్విక్‌సాయిరాజ్ జంట కొరియాకు చెందిన సియో జే-యజంగ్ ద్వయంతో పోటీపడనుండగా, మహిళల డబుల్స్‌లో పొన్నప్ప- సిక్కిరెడ్డి జంట అమెరికాకు చెందిన ఎరియల్ లీ- సిడ్నీ లీ జోడితో తలపడనున్నారు.

Tags
English Title
Sindhu, Saina will
Related News