సిమ్రన్‌కు సిల్వర్

Updated By ManamMon, 10/15/2018 - 03:42
Simran

Simranబ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా):యూత్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ సిమ్రన్ రజత పతకాన్ని కైవసం చేసు కుంది. ఆదివారమిక్కడ జరిగిన మహిళల ఫ్రీ స్టయిల్ (43 కిలోల) ఫైనల్  బౌట్‌లో అమెరికాకు చెందిన ఎమిలి షిల్‌సన్ చేతిలో ఓడిపోయి సిమ్రన్ రజత పతకాన్ని సాధించింది. 2017లో జరిగిన క్యాడేట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 40 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన సిమ్రన్, ఫైనల్ బౌట్‌లో 6-11తో ఎమిలి చేతిలో ఓడిపోయి బంగారు పతకాన్ని చేజార్చుకుంది. మొదటి పిరియడ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరచిన భారత రెజ్లర్ 2-9తో వెనుకంజ వేసింది. తర్వాత జరిగిన రెండో పిరియడ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి 4 పాయింట్లు సాధించింది. 2018 క్యాడే ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో షిల్‌సన్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.  యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటీవరకు 3 స్వర్ణాలు, 5 రజత పతకాలను సాధించింది.

Tags
English Title
Silver for Simran
Related News